Breaking News

గాయత్రి–ట్రెసా జోడీ శుభారంభం 

Published on Wed, 09/13/2023 - 01:11

కౌలూన్‌: హాంకాంగ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల డబుల్స్‌ విభాగంలో భారత నంబర్‌వన్‌ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌లో గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 54 నిమిషాల్లో 21–15, 16–21, 21–16తో జిలీ డెబోరా–చెరిల్‌ సీనెన్‌ (నెదర్లాండ్స్‌) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

గురువారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఏడో సీడ్‌ అప్రియాని రహాయు–సితీ ఫాదియా సిల్వా (ఇండోనేసియా)లతో గాయత్రి–ట్రెసా తలపడతారు. మహిళల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ నుంచి మాళవిక బన్సోద్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత పొందగా... పురుషుల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ నుంచి కిరణ్‌ జార్జి, రవి చివరి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఓడిపోయి మెయిన్‌ ‘డ్రా’కు చేరుకోలేకపోయారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సుమీత్‌ రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) ద్వయం మెయిన్‌ ‘డ్రా’కు చేరింది.

క్వాలిఫయింగ్‌ మ్యాచ్‌లో సుమీత్‌–అశ్విని జోడీ 21–15, 21–14తో అలి్వన్‌ మొరాదా–అలీసా (చెక్‌ రిపబ్లిక్‌) జంటను ఓడించింది. మహిళల డబుల్స్‌ క్వాలిఫయింగ్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో జోడీ 21–16, 21–14తో సిక్కి రెడ్డి–ఆరతి జంటపై గెలిచి మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించింది.   

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)