Breaking News

బీడబ్ల్యూఎఫ్‌ ఫైనల్స్‌కు గాయత్రి–ట్రెసా జోడీ అర్హత

Published on Wed, 11/27/2024 - 04:12

న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ కు పుల్లెల గాయత్రి గోపీచంద్‌–ట్రెసా జాలీ జోడీ అర్హత సాధించింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి–ట్రెసా వరల్డ్‌ ర్యాంకింగ్‌ ప్రకారం అర్హత సాధించారు. మంగళవారం ప్రకటించిన ఈ ర్యాంకింగ్స్‌లో టాప్‌–8 జోడీలు ప్రతిష్టాత్మక ఫైనల్స్‌ టోర్నీ ఆడతాయి. భారత్‌ నుంచి ఈ టోర్నీలో వీరిద్దరు మాత్రమే బరిలోకి దిగుతున్నారు. 

ఈ సీజన్‌లో గాయత్రి–ట్రెసా నిలకడగా రాణించారు. చైనా మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్స్‌లోనే ఓడినా... ఇతర టోర్నీనల ప్రదర్శన వారికి ఈ అవకాశం కల్పింపంచింది. సింగపూర్‌ ఓపెన్, మకావు ఓపెన్‌లలో గాయత్రి–ట్రెసా సెమీఫైనల్‌కు చేరారు. ఇప్పటి వరకు బీడబ్ల్యూఎఫ్‌ టూర్‌ ఫైనల్స్‌లో మహిళల సింగిల్స్‌ విభాగంలో పీవీ సింధు మాత్రమే 2018లో విజేతగా నిలిచింది. 

సీజన్‌ చివరి టోర్నీకి అర్హత సాధించడం పట్ల ట్రెసా జాలీ సంతోషం వ్యక్తం చేసింది. ‘తొలిసారి ఫైనల్స్‌కు క్వాలిఫై కావడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. నాకౌట్‌ టోర్నీ కాదు కాబట్టి గ్రూప్‌ దశలో ప్రతీ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయతి్నస్తాం’ అని ఆమె పేర్కొంది. చైనాలోని హాంగ్జూలో డిసెంబర్‌ 11–15 మధ్య బీడబ్ల్యూఎఫ్‌ ఫైనల్స్‌ జరుగుతుంది

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)