Breaking News

ఇంగ్లండ్ టూర్‌.. కామాఖ్య ఆలయంలో గంభీర్ ప్రత్యేక పూజలు! వీడియో

Published on Mon, 05/26/2025 - 16:25

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ప్ర‌ధాన కోచ్ గౌత‌మ్ గంభీర్ అస్సాంలోని గౌహతిలో ఉన్న     కామాఖ్య ఆలయాన్ని సందర్శించాడు. సోమవారం ఆలయానికి చేరుకున్న గంభీర్‌కు ఆర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

గంభీర్ కొన్ని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలుస్తోంది.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా కామాఖ్య ఆలయం దేశంలోని అత్యంత ప్రముఖ శక్తి పీఠాలలో ఒకటి.  ఈ ఆలయాన్ని ప్రతీ రోజు వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుం‍టారు.

గంభీర్ ఇటీవల తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్నాడు. ఇక భారత్‌- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమవుతోంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సిరీస్‌కు భారత జట్టును బీసీసీ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. 

అదేవిధంగా సాయిసుదర్శన్‌, అర్ష్‌దీప్ సింగ్ వంటి యువ ఆట‌గాళ్ల‌కు తొలిసారి టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కింది. అదేవిధంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి సీనియర్లు టెస్టులకు వీడ్కోలు పలకడంతో యువ ఆటగాళ్లతో కూడిన‌ భారత జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. కాగా ఈ సిరీస్‌ వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2025-27లో భాగంగా జరగనుంది. ఈ సిరీస్‌ భారత జట్టుకు చాలా కీలకం.

ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్‌, సిరాజ్‌
 



 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)