Breaking News

ఆనంద్‌ x కాస్పరోవ్‌

Published on Wed, 10/08/2025 - 03:49

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): చదరంగ దిగ్గజాలు గ్యారీ కాస్పరోవ్‌ (రష్యా), విశ్వనాథన్‌ ఆనంద్‌  (భారత్‌) మరోసారి ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యారు. ‘క్లచ్‌ చెస్‌: ద లెజెండ్స్‌ టోర్నమెంట్‌’ పేరుతో ఈ ఇద్దరి మధ్య ర్యాపిడ్, బ్లిట్జ్‌ ఫార్మాట్‌లో మూడు రోజులపాటు టోర్నీని నిర్వహించనున్నారు. ‘చెస్‌ 960’ మ్యాచ్‌లో భాగంగా ఆనంద్, కాస్పరోవ్‌ 12 గేమ్‌లు ఆడతారు. ప్రతి రోజు వీరిద్దరి మధ్య నాలుగు గేమ్‌లు (రెండు ర్యాపిడ్, రెండు బ్లిట్జ్‌) జరుగుతాయి. మొదటి రోజున గేమ్‌ గెలిస్తే ఒక్కో పాయింట్‌ దక్కుతుంది. 

రెండో రోజున గేమ్‌ గెలిస్తే రెండు పాయింట్ల చొప్పున... మూడో రోజున గేమ్‌ గెలిస్తే మూడు పాయింట్ల చొప్పున లభిస్తాయి. విజేతకు 70 వేల డాలర్లు (రూ. 62 లక్షలు), రన్నరప్‌ ప్లేయర్‌కు 50 వేల డాలర్లు (రూ. 44 లక్షలు) అందజేస్తారు. అధికారికంగా ఆనంద్, కాస్పరోవ్‌ చివరిసారి 1995లో క్లాసికల్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ కోసం పోటీపడ్డారు. 

కాస్పరోవ్‌ 10.5–7.5తో ఆనంద్‌పై గెలిచి ప్రపంచ టైటిల్‌ దక్కించుకున్నాడు. 2004లో చెస్‌కు వీడ్కోలు పలికిన కాస్పరోవ్‌ ఎగ్జిబిషన్, బ్లిట్జ్‌ ఈవెంట్లలో... ఆనంద్‌ కొన్ని ఎంచుకున్న టోర్నీల్లో మాత్రమే బరిలోకి దిగుతున్నారు.    

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)