Breaking News

చరిత్ర సృష్టించిన రాహుల్‌.. ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ! రెండో ఆటగాడిగా

Published on Sat, 01/06/2024 - 11:25

రంజీ ట్రోఫీ-2024 సీజన్‌లో భాగంగా నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఆటగాడు రాహుల్‌ సింగ్‌ గహ్లోత్‌ డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. రాహుల్‌ 143 బంతుల్లో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా 157 బంతులు ఎదుర్కొన్న రాహుల్‌ సింగ్‌.. 23 ఫోర్లు, 9 సిక్స్‌లతో 214 పరుగులు చేశాడు. ఇక డబుల్‌ సెంచరీతో చెలరేగిన రాహుల్‌ సింగ్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. 

రంజీ ట్రోఫీలో వేగవంతమైన డబుల్‌ సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా రాహుల్‌ రికార్డులకెక్కాడు. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి పేరిట ఉంది. 1985లో వాంఖడేలో బరోడాతో జరిగిన మ్యాచ్‌లో బాంబే (ప్రస్తుతం ముంబై) తరఫున 123 బంతుల్లో శాస్త్రి తన డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్‌  76.4 ఓవర్లలో 5 వికెట్లకు 474 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది. హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌లో రాహుల్‌తో పాటు కెప్టెన్‌ తిలక్‌ వర్మ అజేయ శతకం (112 బంతుల్లో 100 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) నమోదు చేశాడు.
చదవండి: #David Warner: ముగిసిన వార్నర్‌ శకం.. ఎన్నో అద్బుతాలు! అదొక్కటే మాయని మచ్చ?
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)