రుత్విక–రోహన్‌ జోడీకి టైటిల్‌

Published on Mon, 11/11/2024 - 03:12

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఎండీసీ తెలంగాణ ఇంటర్నేషనల్‌ చాలెంజ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత జట్టు మాజీ సభ్యురాలు, తెలంగాణ అమ్మాయి గద్దె రుత్విక శివాని టైటిల్‌ సాధించింది. గచ్చిబౌలిలోని కొటక్‌ పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో ఆదివారం ఈ టోర్నీ ముగిసింది. ఐదు విభాగాల్లోనూ (మహిళల సింగిల్స్, డబుల్స్, పురుషుల సింగిల్స్, డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌) భారత క్రీడాకారులకే విన్నర్స్, రన్నరప్‌ ట్రోఫీలు దక్కడం విశేషం. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో రుత్విక శివాని–రోహన్‌ కపూర్‌ (భారత్‌) జంట 21–17, 21–19తో హరిహరన్‌–తనీషా క్రాస్టో (భారత్‌) జోడీని ఓడించింది. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ ఇషారాణి బారువా (భారత్‌)కు లభించింది. ఫైనల్లో ఇషారాణి 21–15, 9–21, 21–17తో రక్షిత శ్రీ (భారత్‌)పై గెలిచింది. పురుషుల సింగిల్స్‌ విభాగంలో తెలంగాణ ప్లేయర్‌ కాటం తరుణ్‌ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో తరుణ్‌ రెడ్డి 11–21, 14–21తో భారత్‌కే చెందిన రిత్విక్‌ సంజీవి చేతిలో ఓడిపోయాడు. 

పురుషుల డబుల్స్‌ ఫైనల్లో పంజాల విష్ణువర్ధన్‌ గౌడ్‌–ఎంఆర్‌ అర్జున్‌ (భారత్‌) జోడీ 19–21, 17–21తో పృథ్వీ కృష్ణమూర్తి–సాయిప్రతీక్‌ (భారత్‌) జంట చేతిలో ఓటమి పాలైంది. మహిళల డబుల్స్‌ ఫైనల్లో ప్రియా కొంజెంగ్‌బమ్‌–శ్రుతి మిశ్రా (భారత్‌) ద్వయం 21–18, 21–13తో ఆరతి సారా సునీల్‌–వర్షిణి (భారత్‌) జోడీపై గెలిచింది.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)