Breaking News

స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ రిటైర్మెంట్‌

Published on Thu, 07/10/2025 - 08:28

లండన్‌: ప్రొఫెషనల్‌ టెన్నిస్‌ నుంచి వైదొలుగుతున్నట్లు ఇటలీ టెన్నిస్‌ స్టార్‌ ఫాబియో ఫాగ్‌నిని ప్రకటించాడు. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ఫాగ్‌నిని తొలి రౌండ్‌లో ఓడిపోయాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 38 ఏళ్ల ఫాగ్‌నిని ఐదు సెట్‌లు పోరాడాడు. 

ఈ ఏడాది చివర్లో ఆటకు గుడ్‌బై చెప్పాలని ఫాగ్‌నిని అనుకున్నాడు. అయితే ఈ సీజన్‌లో వరుసగా పది పరాజయాలు ఎదురుకావడంతో వింబుల్డన్‌ టోర్నీ సందర్భంగానే అతను రిటైర్మెంట్‌ ప్రకటనను జారీ చేశాడు.

‘ఆటకు గుడ్‌బై చెప్పాక ఏం చేస్తానో ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతం మాత్రం కుటుంబంతో గడుపుతాను’ అని కెరీర్‌లో 9 సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన ఫాగ్‌నిని తెలిపాడు. 2019లో మోంటెకార్లో మాస్టర్స్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గిన ఫాగ్‌నిని అదే ఏడాది కెరీర్‌ బెస్ట్‌ 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 

2015 యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌ ఫ్లావియా పెనెట్టా (ఇటలీ)ను పెళ్లి చేసుకున్న ఫాగ్‌నిని తన 20 ఏళ్ల కెరీర్‌లో మొత్తం 63 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడాడు. 2011 ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకోవడమే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో అతని అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన. ప్రస్తుతం ఫాగ్‌నిని 138వ ర్యాంక్‌లో ఉన్నాడు.    

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు