Breaking News

దిగ్గ‌జ క్రికెట‌ర్ క‌న్నుమూత‌.. నివాళులర్పించిన ఇంగ్లండ్‌-భార‌త్ ఆట‌గాళ్లు

Published on Sun, 06/22/2025 - 16:57

ఇంగ్లండ్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జ‌ట్టు మాజీ ఫాస్ట్ బౌల‌ర్‌,  గ్లౌసెస్టర్‌షైర్ దిగ్గ‌జం  డేవిడ్ వాలెంటైన్ లారెన్స్(61) కన్నుమూశారు. గత కొంత కాలంగా మోటార్ న్యూరోన్ వ్యాధితో బాధపడుతున్న  లారెన్స్.. ఆదివారం తుది శ్వాస విడిచారు.

1988లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన లారెన్స్‌.. ఇంగ్లండ్ తరపున ఐదు టెస్టులు ఆడి 18 వికెట్లు సాధించారు. 1991లో ది ఓవల్‌లో వెస్టిండీస్‌పై అద్బుతమైన ఫైవ్ వికెట్ల హాల్ సాధించారు. ఆ సమయంలో విండీస్‌ దిగ్గజం వివ్ రిచర్డ్స్‌ను అవుట్ చేశారు.

అయితే అద్బుతమైన టాలెంట్ ఉన్నప్పటికి మెకాలి గాయం కారణంగా 1992లో ఆయన్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడింది. పస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం ఆయన ఎన్నో ఘనతలను అందుకున్నారు. 185 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన లారెన్స్‌..515 వికెట్లు పడగొట్టారు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో కూడా ఆయన పేరిట 155 వికెట్లు ఉన్నాయి.

నివాళులర్పించిన ఇంగ్లండ్‌-భార‌త్ ఆట‌గాళ్లు..
లారెన్స్ మృతి పట్ల భారత్‌-ఇంగ్లండ్ ఆటగాళ్లు సంతాపం వ్యక్తం చేశారు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ఆరంభానికి ముందు ఇరు జట్ల ఆటగాళ్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంత‌రం ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడుతూ ఆట‌గాళ్లు చ‌ప్ప‌ట్లు కొట్టారు. అదేవిధంగా ఇంగ్లండ్‌-భారత్ ప్లేయర్లు భుజానికి నల్ల బ్యాండ్లు క‌ట్టుకుని బ‌రిలోకి దిగారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించింది.

ఇంగ్లండ్‌ ఐదో వికెట్‌ డౌన్‌..
మూడో రోజు ఆటలో భారత బౌలర్లు రాణిస్తున్నారు. 67 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్‌ 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. నాలుగో వికెట్‌గా సెంచూరియన్‌ ఓలీ పోప్‌(106) ఔట్‌ కాగా.. ఐదో వికెట్‌గా కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌(20) పెవిలియన్‌కు చేరాడు.

భారత బౌలర్లలో ఇప్పటివరకు బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ద్‌ కృష్ణ తలా వికెట్‌ సాధించారు. ఇంగ్లండ్‌ ఇంకా టీమిండియా స్కోర్‌కు 189 పరుగులు వెనకంజలో ఉంది. క్రీజులో ఇంగ్లండ్‌ బ్యాటర్లు హ్యారీ బ్రూక్‌(42), జేమీ స్మిత్‌(5) ఉన్నారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య