Breaking News

స్లేటర్‌కు నాలుగేళ్ల జైలు

Published on Wed, 04/23/2025 - 02:44

సిడ్నీ: గృహ హింస తదితర కేసుల్లో ఆ్రస్టేలియా మాజీ క్రికెటర్‌ మైకేల్‌ స్లేటర్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. అయితే అతను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా జడ్జి తీర్పునిచ్చారు. గతంలో ఈ కేసులో స్లేటర్‌ ఏడాది పాటు పోలీసుల నిర్బంధంలోనే ఉన్నాడు. తాజా తీర్పు ప్రకారం అతని మిగిలిన మూడేళ్ల శిక్షను కూడా రద్దు చేశారు. దాదాపు ఏడాదిన్నర క్రితం ఒక మహిళను వెంటపడి వేధించడంతో పాటు స్లేటర్‌ అసభ్యకర సందేశాలు కూడా పంపించాడు. 

పోలీసు విచారణలో ఇవన్నీ వాస్తవమని తేలడంతో అతడిని జైలుకు పంపించారు. అయితే స్లేటర్‌ సుదీర్ఘ కాలం పాటు మద్యానికి బానిసై మానసిక సమస్యలతో బాధపడ్డాడని, ఇదే కారణంగా ఇలాంటి తప్పుడు పనికి పాల్పడ్డాడని అతని లాయర్లు వాదించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు సంబంధించి కూడా అతనిపై వేర్వేరు కేసులు ఉన్నాయి. జైలులో ఉన్న 375 రోజుల పాటు అతను సత్ప్రవర్తనతో మెలిగాడని వారు వివరించారు. దాంతో అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటూ న్యాయమూర్తి 55 ఏళ్ల స్లేటర్‌ శిక్షను కుదించారు. 

అయితే స్లేటర్‌ వచ్చే ఐదేళ్లపాటు ‘సస్పెండెడ్‌ పీరియడ్‌’లో ఉంటాడు. ఈ సమయంలో మళ్లీ ఏదైనా తప్పు చేస్తే మాత్రం తీవ్ర శిక్షకు గురవుతాడు. స్లేటర్‌ 1993–2001 మధ్య కాలంలో ఆ్రస్టేలియాకు 74 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 42.83 సగటుతో 5312 పరుగులు సాధించాడు. 14 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలతో  అతను ఆసీస్‌ అప్రతిహత విజయాల్లో ఓపెనర్‌గా కీలకపాత్ర పోషించాడు. 42 వన్డేలు కూడా ఆడిన స్లేటర్‌ ప్రస్తుతం కామెంటేటర్‌గా స్థిరపడ్డాడు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)