Breaking News

లైంగిక వేధింపులు.. కటకటాల్లో స్టార్‌ ఫుట్‌బాలర్‌

Published on Sat, 01/21/2023 - 10:15

లైంగిక వేధింపుల కేసులో బ్రెజిల్ స్టార్‌ ఫుట్‌బాలర్‌ డానీ అల్వెస్ అరెస్ట్ అయ్యాడు. స్పెయిన్ పోలీసులు అత‌డిని శుక్ర‌వారం అదుపులోకి తీసుకున్నారు. డానీ అల్వెస్‌ బెయిల్‌ అప్పీల్‌ చేసుకోగా.. బెయిల్‌ ఇచ్చే ప్రసక్తే లేదన్న స్పెయిన్‌ కోర్టు.. డానీ అల్వెస్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులను ఆదేశించింది.

విషయంలోకి వెళితే.. డిసెంబ‌ర్ 31న స్పెయిన్‌లో బార్సిలోనా నైట్ క్ల‌బ్‌లో డానీ, స‌ద‌రు మ‌హిళ ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆమె అనుమ‌తి లేకుండా లోదుస్తుల్లో చేతులు పెట్టాడు. ఈ విష‌యాన్ని స్పానిష్ మీడియా బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. ఆ మ‌హిళ కూడా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో డానీపై కేసు న‌మోదు చేశారు. 2022లో ఖ‌త‌ర్‌లో జ‌రిగిన‌ ఫిఫి వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడిన బ్రెజిల్ జ‌ట్టులో డానీ స‌భ్యుడు. క్వార్ట‌ర్ ఫైన‌ల్లో కామెరూన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్య‌వ‌హరించాడు. బ్రెజిల్ త‌ర‌ఫున‌ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడిన పెద్ద వ‌య‌స్కుడిగా డానీ గుర్తింపు సాధించాడు.

ఇక పోలీసుల కస్టడీలో అల్వెస్‌ డానీ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నట్లు స్థానిక మీడియా లా వాంగార్డియా పత్రిక తమ కథనంలో పేర్కొంది.''ఆ స‌మ‌యంలో తాను ఆ క్ల‌బ్‌లో కొంత‌మందితో క‌లిసి ఉన్నాన‌ని, కానీ తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని ఈ ఫుట్‌బాల‌ర్ తెలిపాడు. నేను డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాను. అంతేత‌ప్ప ఇత‌రులకు ఏ ఇబ్బంది క‌లిగించ‌లేదు. ఆ మ‌హిళ ఎవ‌రో నాకు తెలియ‌దు. అలాంట‌ప్పుడు నేను ఆమెతో అస‌భ్య‌క‌రంగా ఎలా ప్ర‌వ‌ర్తించ‌గ‌ల‌ను ?'' అని అల్వెస్‌ పేర్కొన్నట్లు తెలిపింది.

ఇక బ్రెజిల్‌ తరపున 2006లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన డానీ అల్వెస్‌ జట్టు తరపున 126 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది గోల్స్‌ చేశాడు. ఇక 2008 నుంచి 2016 వరకు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన డానీ 2021-22 సీజన్‌లో స్పానిష్‌ క్లబ్‌కు ఆడాడు. ప్రస్తుతం మెక్సికన్‌ క్లబ్‌ అయిన పుమాస్‌ యూనమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

చదవండి: రూల్స్‌ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)