Breaking News

'షమీపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు.. 200 శాతం అలాంటి పని చేయడని చెప్పా'

Published on Tue, 02/14/2023 - 15:07

మహ్మద్‌ షమీ.. ప్రస్తుత భారత జట్టులో కీలక పేసర్‌గా కొనసాగుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా షమీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. అయితే షమీ తన క్రికెట్‌ కెరీర్‌తో పాటు తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా 2018లో షమీపై అత‌డి మాజీ భార్య హ‌సీన్ జ‌హాన్ గృహ హింస కేసును పెట్టింది. దీంతో ఒక్క సారిగా షమీ వార్తల్లో నిలిచాడు.

అదే విధంగా షమీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డంటూ ఆమె తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీంతో బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దర్యాప్తు కూడా చేపట్టింది. అయితే ఆరోపణలు అవాస్తమని యాంటీ క‌ర‌ప్షన్‌ విభాగం కొట్టపారేసింది. తాజాగా ఇదే విషయంపై భారత వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. 

క్రిక్‌బజ్‌ షో 'రైజ్‌ ఆఫ్‌ న్యూండియా' లో ఇషాంత్‌ మాట్లాడుతూ.."షమీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల గురించి అవినీతి నిరోధక విభాగం హెడ్‌ నీరజ్‌ కుమార్‌ మా జట్టు సభ్యులందరినీ విచారించారు. పోలీసులు అడిగినట్లే అన్ని విషయాలు మా దగ్గర తెలుసుకున్నారు.

అదే విధంగా షమీ వ్యక్తిగత విషయాలు గురించి నన్ను ప్రశ్నించారు. అయితే అతడి వ్యక్తిగత విషయాలు గురించి నాకు తెలియదు అని బదులు ఇచ్చాను. కానీ నా వరకు అయితే షమీ 200 శాతం అలాంటి పని చేయడని చెప్పాను. ఈ విచార‌ణ త‌ర్వాత ష‌మీతో త‌న అనుబంధం మ‌రింత బ‌ల‌ప‌డింది" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. టీమిండియాకు బిగ్‌షాక్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)