Breaking News

ఎట్టకేలకు టెండుల్కర్‌ అంటూ సచిన్‌ ఉద్వేగ ట్వీట్‌! నీ మనసు బంగారం షారుఖ్‌!

Published on Wed, 04/19/2023 - 13:42

IPL 2023- SRH Vs MI- Arjun Tendulkar: ‘‘ముంబై ఇండియన్స్‌ మరోసారి అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిసింది. కామెరాన్‌ గ్రీన్‌ బ్యాట్‌, బాల్‌తో రాణించాడు. ఇషాన్‌, తిలక్‌ ఎప్పటిలాగానే మరోసారి తమ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఐపీఎల్‌ రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. 

చాలా బాగా ఆడుతున్నారు బాయ్స్‌!’’ అంటూ టీమిండియా దిగ్గజం, ముంబై ఇండియన్స్‌ ఐకాన్‌ సచిన్‌ టెండుల్కర్‌ తమ జట్టుపై ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా.. ‘ఎట్టకేలకు టెండుల్కర్‌ పేరు మీద ఓ ఐపీఎల్‌ వికెట్‌!’ అంటూ పుత్రోత్సాహంతో పొంగిపోయాడు. కాగా ఐపీఎల్‌-2023లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ముంబై 14 పరుగుల తేడాతో గెలుపొందింది.

ముంబై తాజా గెలుపుతో
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన రోహిత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. టార్గెట్‌ ఛేదనకు దిగిన రైజర్స్‌ను 178 పరుగులకే కట్టడి చేసి ఈ సీజన్‌లో మూడో విజయం అందుకుంది. ఇక ఆఖరి ఓవర్లో బౌలింగ్‌ చేసిన ముంబై ఆల్‌రౌండర్‌ అర్జున్‌ టెండుల్కర్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ను అవుట్‌ చేయడం ద్వారా కెరీర్‌లో తొలి ఐపీఎల్‌ వికెట్‌ సాధించాడు.

నీ మనసు బంగారం షారుఖ్‌
ఈ నేపథ్యంలో సచిన్‌ టెండుల్కర్‌ తన కుమారుడిని ఉద్దేశించి భావోద్వేగ ట్వీట్‌ చేశాడు. అర్జున్‌ కారణంగా ఎట్టకేలకు టెండుల్కర్‌ ఖాతాలో వికెట్‌ కూడా చేరిందంటూ సంతోషం వ్యక్తం చేశాడు. ఇక బాలీవుడ్‌ బాద్‌ షా, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ సైతం స్నేహితుడి కుమారుడి ప్రతిభను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశాడు.

ఇందుకు బదులిచ్చిన సచిన్‌.. ‘‘ఎంఐ, కేకేఆర్‌ జెర్సీలలో బంగారు వర్ణపు దారాలు కలగలిసి ఉంటాయి. అయితే, నీ మనసు మాత్రం వందకు వంద శాతం గోల్డే షారుఖ్‌! థాంక్యూ’’ అంటూ షారుఖ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇదిలా ఉంటే.. దాదాపు రెండేళ్లుగా ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్న అర్జున్‌ ఎట్టకేలకు ఈ సీజన్‌లో అరంగేట్రం చేశాడు. 

కేకేఆర్‌పై ఎంట్రీ
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌తో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌కు ఈ మ్యాచ్‌లో విజయం రూపంలో శుభశకునం ఎదురైంది. తాజాగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో వికెట్‌ కూడా తీసి తన ఖాతా తెరిచాడు ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.  

చదవండి: IPL 2023: ఫిక్సింగ్‌ కలకలం.. సిరాజ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్‌! అతడెవరో కాదు..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)