Breaking News

ఎట్టకేలకు గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అ‘మెరిక’న్‌

Published on Thu, 09/05/2024 - 03:25

న్యూయార్క్‌: సుదీర్ఘ నిరీక్షణకు తెరపడనుంది. ఎట్టకేలకు 2009 తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో అమెరికా ప్లేయర్‌ను ఫైనల్లో చూడబోతున్నాం. సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో అమెరికా ఆటగాళ్లు టేలర్‌ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్‌ టియాఫో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. 

తొలి సెమీఫైనల్లో వీరిద్దరు ముఖాముఖిగా తలపడనున్నారు. దాంతో ఓ అమెరికా ప్లేయర్‌ యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించడం ఖాయమైంది. 2009 వింబుల్డన్‌ టోరీ్నలో ఆండీ రాడిక్‌ తర్వాత మరో అమెరికా ప్లేయర్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి క్వార్టర్‌ ఫైనల్లో 12వ సీడ్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ 7–6 (7/2), 3–6, 6–4, 7–6 (7/3)తో నాలుగో సీడ్, 2020 రన్నరప్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)ను బోల్తా కొట్టించాడు. 

తొమ్మిదో సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా)తో జరిగిన రెండో క్వార్టర్‌ ఫైనల్లో 20వ సీడ్‌ టియాఫో 6–3, 6–7 (5/7), 6–3, 4–1తో గెలుపొందాడు. నాలుగో సెట్‌లో టియాఫో 4–1తో ఆధిక్యంలో ఉన్న దశలో దిమిత్రోవ్‌ గాయంతో వైదొలిగాడు. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సబలెంకా (బెలారస్‌), ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌) సెమీఫైనల్లోకి ప్రవేశించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)