Breaking News

సమంగా ముగిసిన ఐదో గేమ్‌

Published on Sun, 12/01/2024 - 02:48

భారత ఆటగాడు దొమ్మరాజు గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌ మధ్య జరుగుతున్న ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌ సమరంలో మరో పోరు సమంగా ముగిసింది. సింగపూర్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌ ఐదో గేమ్‌ 40 ఎత్తుల తర్వాత ‘డ్రా’ అయింది. ఈ ఫలితం అనంతరం గుకేశ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ లిరెన్‌ చెరో 2.5 పాయింట్లతో సమంగా కొనసాగుతున్నారు.

విజేతగా నిలవాలంటే మిగిలిన 9 గేమ్‌లలో మరో 5 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. నల్ల పావులతో ఆడిన లిరెన్‌ తొలి గేమ్‌ తరహాలోనే ఫ్రెంచ్‌ డిఫెన్స్‌తో మొదలు పెట్టాడు. ఆ గేమ్‌లో ఓటమిపాలైన గుకేశ్‌ ఈ సారి జాగ్రత్త పడ్డాడు. అయితే 23వ ఎత్తు వద్ద గుకేశ్‌ తప్పుడు ఎత్తు వేసి ఓటమికి ఆస్కారం కల్పించగా...లిరెన్‌ దానిని గుర్తించలేకపోయాడు. దాంతో గుకేశ్‌ డ్రాతో గట్టెక్కాడు. 

‘నేను చాలా పెద్ద తప్పు చేశానని తర్వాత అర్థమైంది. కానీ అదృష్టవశాత్తూ తప్పించుకున్నాను. ఇంకా ఈ సమరం సగం కూడా కాలేదు. కాబట్టి నాకూ మంచి అవకాశాలున్నాయని నమ్ముతున్నా’ అని గుకేశ్‌ వ్యాఖ్యానించాడు. ఇద్దరి మధ్య ఆరో గేమ్‌ నేడు జరుగుతుంది.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)