Breaking News

సూపర్‌ సౌరవ్‌...

Published on Fri, 10/06/2023 - 03:49

భారత స్క్వాష్‌ స్టార్‌ సౌరవ్‌ ఘోషాల్‌ వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 37 ఏళ్ల సౌరవ్‌ 11–9, 9–11, 5–11, 7–11తో ఇఐన్‌ యో ఎన్జీ (హాంకాంగ్‌) చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు.

2006 దోహా ఆసియా క్రీడల్లో అరంగేట్రం చేసి కాంస్యం నెగ్గిన సౌరవ్‌.. ఆ తర్వాత 2010లో కాంస్యం, 2014లో రజతం, 2018లో కాంస్యం సాధించాడు. తొలిసారి ప్రవేశపెట్టిన మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపిక పల్లికల్‌–హరీందర్‌పాల్‌ జోడీ (భారత్‌) స్వర్ణ పతకం గెలిచింది. ఫైనల్లో దీపిక–హరీందర్‌పాల్‌ ద్వయం 11–10, 11–10తో ఐఫా బింతి అజ్మన్‌–కమాల్‌ (మలేసియా) జంటపై నెగ్గింది.  

రెజ్లర్‌ అంతిమ్‌కు కాంస్యం 
మహిళల రెజ్లింగ్‌లో భారత రైజింగ్‌ స్టార్‌ అంతిమ్‌ పంఘాల్‌ కాంస్య పతకం గెలిచింది. 53 కేజీల విభాగం కాంస్య పతక బౌట్‌లో 19 ఏళ్ల అంతిమ్‌ 3–1తో టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత బొలోర్‌తుయా బత్‌ఒచిర్‌ (మంగోలియా)పై సంచలన విజయం సాధించింది. భారత్‌కే చెందిన పూజా గెహ్లోత్‌ (50 కేజీలు) కాంస్య పతక బౌట్‌లో 2–9తో కెయునిమ్‌జేవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో... మాన్సి అహ్లావత్‌ కాంస్య పతక బౌట్‌లో 70 సెకన్లలో సొబిరోవా (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు.

 మరోవైపు భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో 0–4 గోల్స్‌ తేడాతో చైనా జట్టు చేతిలో ఓడిపోయింది. శనివారం జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో జపాన్‌తో భారత్‌ ఆడుతుంది. పురుషుల మారథాన్‌ రేసులో (42.195 కిలోమీటర్లు) భారత అథ్లెట్లు మాన్‌ సింగ్‌ ఎనిమిదో స్థానంలో (2గం:16ని:59 సెకన్లు), అప్పచంగడ బెలియప్ప (2గం:20ని:52 సెకన్లు) 12వ స్థానంలో నిలిచారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)