Breaking News

2026 FIFA World Cup: భారత ఫుట్‌బాల్‌ జట్టు సత్తాకు పరీక్ష

Published on Tue, 06/11/2024 - 04:21

దోహా: స్టార్‌ ప్లేయర్, కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత... భారత ఫుట్‌బాల్‌ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్‌ ఆసియా జోన్‌ రెండో రౌండ్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా గ్రూప్‌ ‘ఎ’లో భారత జట్టు తమ చివరి లీగ్‌ మ్యాచ్‌ను ఆసియా చాంపియన్‌ ఖతర్‌ జట్టుతో నేడు ఆడనుంది. ఓవరాల్‌గా ఖతర్‌తో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆడిన భారత్‌ ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని, మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 

ఇప్పటికే ఆసియా జోన్‌ మూడో రౌండ్‌కు అర్హత పొందిన ఖతర్‌ జట్టుకు ఈ మ్యాచ్‌ ప్రాక్టీస్‌లా ఉపయోగ పడనుండగా... భారత జట్టుకు మాత్రం తాడోపేడోలాంటింది. గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధూ నాయకత్వంలో ఈ మ్యాచ్‌ ఆడనున్న భారత జట్టు విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మూడో రౌండ్‌కు చేరుకుంటుంది. 

ఒకవేళ ‘డ్రా’గా ముగిస్తే మాత్రం అఫ్గానిస్తాన్, కువైట్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ ఫలితంపై భారత జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. భారత్‌ తమ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే అఫ్గానిస్తాన్‌–కువైట్‌ మ్యాచ్‌ కూడా ‘డ్రా’గా ముగియాలి. అలా జరిగితేనే భారత్‌ మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ అఫ్గానిస్తాన్‌–కువైట్‌ మ్యాచ్‌లో ఫలితం వస్తే గెలిచిన జట్టు మూడో రౌండ్‌కు చేరుకుంటుంది. భారత్‌తోపాటు ఓడిన మరో జట్టు రెండో రౌండ్‌కే పరిమితమవుతుంది. 2026 ప్రపంచకప్‌లో తొలిసారి 48 జట్లు పోటీపడనుండగా... ఆసియా నుంచి 8 జట్లకు నేరుగా అవకాశం లభిస్తుంది. మరో బెర్త్‌ ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ ద్వారా ఖరారవుతుంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)