Breaking News

హంపి గేమ్‌ ‘డ్రా’... హారిక పరాజయం

Published on Tue, 04/15/2025 - 01:46

పుణే: ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి సిరీస్‌ ఐదో అంచె చెస్‌ టోర్నమెంట్‌లో తొలి రోజు నలుగురు భారత క్రీడాకారిణులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, వైశాలి రమేశ్‌బాబు తమ తొలి గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... ద్రోణవల్లి హారిక పరాజయం చవిచూసింది. ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌ దివ్య దేశ్‌ముఖ్‌ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌ గేముల్లో భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ వైశాలితో నల్లపావులతో ఆడిన ప్రపంచ ర్యాపిడ్‌ చాంపియన్‌ హంపి 53 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. 

చైనా గ్రాండ్‌మాస్టర్‌ జు జినెర్‌ 53 ఎత్తుల్లో హారికపై గెలుపొందింది. నుర్గుల్‌ సలీమోవా (బల్గేరియా)తో జరిగిన గేమ్‌లో నల్లపావులతో పోటీపడ్డ దివ్య దేశ్‌ముఖ్‌ 53 ఎత్తుల్లో నెగ్గడం విశేషం. భారత ప్లేయర్ల గేమ్‌లన్నీ 53 ఎత్తుల్లోనే ముగియడం గమనార్హం. ఇతర తొలి రౌండ్‌ గేముల్లో బత్కుయాగ్‌ మున్‌గున్‌తుల్‌ 85 ఎత్తుల్లో మెలియా సలోమీ (జార్జియా)పై, పొలీనా షువలోవా (రష్యా) 57 ఎత్తుల్లో అలీనా కష్లిన్‌స్కాయా (పోలాండ్‌)పై గెలుపొందారు. మొత్తం 10 మంది ప్లేయర్ల మధ్య తొమ్మిది రౌండ్‌లపాటు ఈ టోర్నీ జరగనుంది.    

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)