Breaking News

కావాలనే ఓడిపోయాడా?.. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య స్పందన ఇదే

Published on Sat, 12/14/2024 - 10:52

క్రీడల్లో ఆటగాళ్లు పొరపాటు చేయడం సహజమని అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్‌ తెలిపారు. అంత మాత్రాన ప్రపంచ చెస్‌ చాంపియన్‌షిప్‌లో పోటీతత్వం, తీవ్రత లేవనే విమర్శలు అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. సింగపూర్‌ సిటీ వేదికగా గురువారం ముగిసిన వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో దొమ్మరాజు గుకేశ్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

చెస్‌ ఆట అంతమైందంటూ
భారత్‌కు చెందిన ఈ 18 ఏళ్ల టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పిన్న వయసులోనే ఈ ఘనత సాధించిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే, ఈ టోర్నీ పోటీలపై మాజీ ప్రపంచ చాంపియన్, రష్యా గ్రాండ్‌మాస్టర్‌ వ్లాదిమిర్‌ క్రామ్నిక్‌ స్పందిస్తూ చెస్‌ ఆట అంతమైందని తీవ్ర పదజాలాన్ని వాడాడు. చెస్‌లో 14 రౌండ్ల పాటు జరిగిన గేముల్లో పోటాపోటీ కొరవడిందని, గట్టి పోటీ కనిపించనే లేదని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.

అతడివి పిల్లచేష్టలు.. ఏ ఆటలోనైనా సహజమే
అంతేకాదు.. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాతో బరిలోకి దిగిన చైనా గ్రాండ్‌మాస్టర్‌ డింగ్‌ లిరెన్‌ వేసిన ఎత్తులు పిల్లచేష్టలుగా అభివర్ణించాడు. దీనిపై రష్యాకే చెందిన వొర్కొవిచ్‌ స్పందిస్తూ ‘క్రీడల్లో పొరపాట్లు చాలా సహజం. ఈ పొరపాట్లనేవి జరగకపోతే ఫుట్‌బాల్‌లో గోల్సే కావు. 

ప్రతీ ఆటగాడు పొరపాట్లు చేస్తాడు. ఆ తప్పుల కోసమే ప్రత్యర్థి కాచుకొని ఉంటాడు. సరైన అవకాశం రాగానే అందిపుచ్చుకుంటాడు. ఇదంతా ఏ ఆటలోనైనా సహజమే. ప్రపంచ చెస్‌ టైటిల్‌ కోసం తలపడిన లిరెన్, గుకేశ్‌లకు అభినందనలు, టైటిల్‌ గెలిచిన గుకేశ్‌కు కంగ్రాట్స్‌’ అని అన్నారు.

ఇక వరుసగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మాగ్నస్‌ కార్ల్‌సన్‌ కూడా కొన్ని రౌండ్లు చూస్తే ప్రపంచ చెస్‌ టైటిల్‌ కోసం జరిగినట్లుగా తనకు అనిపించలేదని... ఏదో ఓపెన్‌ టోర్నీలోని గేములుగా కనిపించాయని అన్నారు. 

పట్టించుకోవాల్సిన అవసరం లేదు
కానీ భారత సూపర్‌ గ్రాండ్‌మాస్టర్, ఐదుసార్లు చాంపియన్‌ అయిన విశ్వనాథన్‌ ఆనంద్‌ అంతా అయ్యాక ఇలాంటి విమర్శలు రావడం ఎక్కడైనా జరుగుతాయని, వీటిని గుకేశ్‌ పట్టించుకోవాల్సిన అవసరం లేనేలేదని కొత్త చాంపియన్‌కు సూచించాడు. భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ కొత్త చరిత్ర లిఖించాడని హర్షం వ్యక్తం చేశాడు. 

ఈ నేపథ్యంలో ఫిడే అధ్యక్షుడు అర్కాడీ వొర్కొవిచ్‌ సైతం వ్లాదిమిర్‌ క్రామ్నిక్‌, కార్ల్‌సన్‌ విమర్శలను కొట్టిపడేస్తూ గుకేశ్‌కు అండగా నిలవడం విశేషం.

చదవండి: గుకేశ్‌కు భారీ నజరానా ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌