Breaking News

చరిత్ర సృష్టించడానికే వచ్చాం.. నేను ముందే చెప్పా: అఫ్గాన్‌ కెప్టెన్‌

Published on Tue, 10/24/2023 - 11:27

వన్డే ప్రపంచకప్‌-2023లో అఫ్గానిస్తాన్‌ మరో సంచలన విజయం సాధించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 8 వికెట్ల తేడాతో అఫ్గాన్‌ చిత్తు చేసింది. అంతర్జాతీయ వన్డేల్లో పాక్‌పై అఫ్గాన్‌కు ఇదే తొలి విజయం.  ఈ చారిత్రత్మక విజయంలో అఫ్టాన్‌ బ్యాటర్లు  గుర్బాజ్‌(65), ఇబ్రహీం జద్రాన్‌(87), రెహమత్‌ షా(77) పరుగులతో కీలక పాత్ర పోషించారు.

ముఖ్యంగా 283 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఫ్గాన్‌ ఓపెనర్లు గుర్బాజ్‌, ఇబ్రహీం జద్రాన్‌ 130 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యం అందించారు. ఆ తర్వాత రెహమత్‌ షా, కెప్టెన్‌ షాహిది మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. పాకిస్తాన్‌ బౌలర్లలో షాహీన్‌ అఫ్రిది, హసన్‌ అలీ తలా వికెట్‌ సాధించారు. ఇక ఈ అద్బుత విజయంపై మ్యాచ్‌ అనంతరం అఫ్గానిస్తాన్‌ కెప్టెన్‌  షాహిది స్పందిచాడు. ఈ మ్యాచ్‌లో తమ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు.

"ఈ విజయం మాకెంతో ప్రత్యేకం. మేము చాలా ప్రొఫెషనల్‌గా ఛేజ్ చేశాం. ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల కోసం అతృతగా ఎదురుచూస్తున్నాము. ఇదే ఆట తీరును మా తదుపరి మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తాము. మేము గత రెండేళ్లుగా క్వాలిటీ క్రికెట్‌ ఆడుతున్నాం. ఆసియాకప్‌లో కూడా మేము మంచి క్రికెట్‌ ఆడాం. దురదృష్టవశాత్తూ టోర్నీ నుంచి బయటకు వచ్చాం.

కానీ అదే పట్టుదలో భారత్‌కు వచ్చాం. మా దేశ ప్రజల కోసం ఈ టోర్నీని చరిత్రాత్మకం చేస్తామని ముందే చెప్పా. అందులో భాగాంగానే తొలుత ఇంగ్లండ్‌ను చిత్తు చేశాం.. ఇప్పుడు పాకిస్తాన్‌ను ఓడించాం. ఈ టోర్నీ అసాంతం ఇదే దృక్పథంతో ఆడుతాం. మా స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. నూర్‌ అహ్మద్‌పై నమ్మకంతో ఈ మ్యాచ్‌లో అవకాశం ఇచ్చాం.

అతడు మా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. తన టాలెంట్‌ ఎంటో చూపించాడు. ఇక గుర్భాజ్‌, ఇబ్రహీం ఇన్నింగ్స్ ప్రారంభించిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆట ప్రారంభం నుంచి చివరి వరకు మా చేతిలోనే ఉంది. నేను రహమత్‌ కలిసి మ్యాచ్‌ విన్నింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పడం ఆనందంగా ఉందని" పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో షాహిది పేర్కొన్నాడు.
చదవండి: AFG vs PAK: చాలా బాధగా ఉంది.. అదే మా కొంపముంచింది! క్రెడిట్‌ మాత్రం వారికే: బాబర్‌ ఆజం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)