Breaking News

నినో... నీకు సలాం!

Published on Sun, 07/28/2024 - 04:44

ఒలింపిక్స్‌కు ఒక్కసారి అర్హత సాధించడమే గొప్ప అనుకుంటుంటే... వరుసగా పదోసారి విశ్వక్రీడల్లో పోటీ పడటాన్ని ఏమనాలి! జార్జియాకు చెందిన 55 ఏళ్ల మహిళా షూటర్‌ నినో సాలుక్‌వాద్జె ఇలాంటి అసాధారణ ఘనత సాధించింది. 1988 సియోల్‌ ఒలింపిక్స్‌ ద్వారా విశ్వక్రీడల్లో అరంగేట్రం చేసిన నినో... తొలి ప్రయత్నంలో 25 మీటర్ల పిస్టల్‌లో స్వర్ణం, 10 మీటర్ల విభాగంలో రజతం సాధించి అదరగొట్టింది. 

ఇక అప్పటి నుంచి వరుసగా అన్నీ ఒలింపిక్స్‌లో పాల్గొన్న నినో... తాజాగా పారిస్‌ క్రీడల ద్వారా వరుసగా పదోసారి గేమ్స్‌ లో పాల్గొన్న క్రీడాకారిణిగా రికార్డు నెలకొలి్పంది. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో నినో బరిలోకి దిగి 562 పాయింట్లు స్కోరు చేసి 38వ స్థానంలో నిలిచింది. కెనడాకు చెందిన ఈక్వె్రస్టియాన్‌ ఇయాన్‌ మిల్లర్‌ కూడా 10 ఒలింపిక్స్‌లో పాల్గొన్నా... అతడు 1980 మాస్కో ఒలింపిక్స్‌కు దూరంగా ఉన్నాడు. 

2016 రియోలో కుమారుడు సోట్నే మచావరియానితో కలిసి పోటీపడటం ద్వారా.. విశ్వక్రీడల్లో బరిలోకి దిగిన తొలి తల్లీ తనయులుగా నినో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు మూడు పతకాలు సాధించిన నినో... తండ్రి చివరి కోరిక మేరకే పదో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నట్లు పేర్కొంది.  

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)