Breaking News

41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. 7 ఫోర్లు, 9 సిక్సర్లతో విధ్వంసం

Published on Fri, 06/19/2026 - 14:47

సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ త‌నలో ఏ మాత్రం జోరు త‌గ్గ‌లేద‌ని మ‌రోసారి నిరూపించాడు. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లో డుప్లెసిస్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెలరేగాడు. ఈ టోర్నీలో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు సారథ్యం వహిస్తున్న ఫాఫ్‌.. శుక్రవారం సీటెల్ ఓర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు.

221 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఈ ప్రోటీస్ ఆటగాడు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు.  41 ఏళ్ల డుప్లెసిస్ కేవలం 52 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 113 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

అతడితో పాటు రుసో(21 బంతుల్లో 7 ఫోర్లు,2 సిక్స్‌లతో 49), వియాన్‌ ముల్డర్‌(15 బంతుల్లో 31) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా సూపర్‌ కింగ్స్‌ టార్గెట్‌ను కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.

సీఫర్ట్‌ సెంచరీ వృథా
మొదట బ్యాటింగ్ చేసిన సీటెల్ ఓర్కాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు టిమ్ సీఫెర్ట్ భారీ(66 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 104 పరుగులు)సెంచరీతో కదం తొక్కాడు. 

అతడితో పాటు మరో ఓపెనర్‌ షాయన్ జహంగీర్ (78 పరుగులు) హాఫ్‌ సెంచరీతో సాధించాడు. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 191 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టెక్సాస్‌ బౌలర్లలో మిల్నే, హస్మి డిసిల్వా తలా వికెట్‌ సాధించారు.

ఐపీఎల్‌కు దూరం
కాగా ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్‌-2026 సీజన్‌లో పాల్గోనలేదు. వేలానికి ముందే అతడు తప్పుకొన్నాడు. ప్లేయర్‌గా తప్పకొన్నప్పటికి వ్యాఖ్యతగా మాత్రం తన సేవలను డుప్లెసిస్ అందించాడు. అంతకంటే ముందు గాయం కారణంగా సౌతాఫ్రికా లీగ్ టీ20 టోర్నీలో కేవలం ఐదు ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు.
చదవండి: గంభీర్‌పై నిప్పులు చెరిగిన మాజీ క్రికెటర్‌ శ్రీశాంత్‌!
 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)