Breaking News

చాలా బాధగా ఉంది.. అతడే మా కొంపముంచాడు: ఆర్సీబీ కెప్టెన్‌

Published on Fri, 04/12/2024 - 06:10

ఐపీఎల్‌-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తీరు ఏ మాత్రం మారలేదు. ఈ మెగా ఈవెంట్‌లో ఆర్సీబీ మరో ఘోర ఓటమిని చవిచూసింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బెంగళూరు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు అదరగొట్టినప్పటికి.. బౌలర్లు మాత్రం దారుణంగా తేలిపోయారు.

197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ముంబై సునాయాసంగా కేవలం 15.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో 9వ స్ధానంలో కొనసాగుతోంది. ఇక ఈ ముంబై చేతిలో ఓటమిపై మ్యాచ్‌ అనంతరం ఫాప్‌ డుప్లెసిస్‌ స్పందించాడు. మంచు ప్రభావం తమ కొంపముంచిందని డుప్లెసిస్‌ తెలిపాడు.

"మేము ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. ఒక మ్యాచ్‌లో విజయం సాధించాలంటే బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండు విభాగాల్లోనూ రాణించాలి. టాస్‌ గెలిచింటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో. ఎందుకంటే మేము కూడా తొలుత బౌలింగ్‌ చేయాలనుకున్నాం. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంది.

మా బౌలర్లు చాలా ఇబ్బంది పడ్డారు.అయితే దీనిని నేను సాకుగా చెప్పాలనుకోవడం లేదు. వారు బాగా ఆడారు. మాపై ఒత్తిడి తెచ్చారు. బౌలింగ్‌లో కూడా అద్బుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో మేము కూడా చాలా తప్పులు చేశాము. ఇటువంటి వికెట్‌పై 190 పైగా స్కోర్‌ను డిఫెండ్‌ చేసుకోవడం అంత ఈజీ కాదు.

పవర్‌ప్లేలో మేము మరి కొన్ని పరుగులు సాధించింటే బాగుండేంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుందని మాకు ముందే తెలుసు కాబట్టి 250 పైగా పరుగులు చేయాల్సింది. ఆరంభంలో వికెట్లు కోల్పోడం కూడా మమ్మల్ని దెబ్బతీసింది. అయితే పాటిదార్‌, నేను క్రీజులో ఉన్నప్పుడు పెద్ద స్కోర్‌ వస్తుందని భావించాను. కానీ ముంబై బౌలర్లు తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. ముఖ్యంగా బుమ్రా అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. అతడు డెత్‌ ఓవర్లలో సూపర్‌ బౌలింగ్‌ చేశాడు.

అతడికి అద్బుతమైన బౌలింగ్‌ స్కిల్స్‌ ఉన్నాయి. బుమ్రాని ఎటాక్‌ చేసి ఒత్తిడిలోకి నెట్టడం అంత సలభం కాదు. లసిత్ మలింగ గైడన్స్‌లో  జస్ప్రీత్‌ మరింత మెరుగయ్యాడని నేను భావిస్తున్నాను. అటువంటి క్లాస్‌ బౌలర్‌ మా జట్టులో ఉంటే బాగుండేది. మా బౌలింగ్‌ విభాగం అంత పటిష్టంగా లేదని మాకు తెలుసు. కాబట్టి రాబోయో మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌ పరంగా మెరుగ్గా రాణించి భారీ స్కోర్లు సాధించాలని" పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో ఫాప్‌ పేర్కొన్నాడు.

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)