ఆటకు రిటైర్మెంట్‌ ప్రకటించిన పార్థివ్‌ పటేల్‌

Published on Wed, 12/09/2020 - 11:54

ముంబై : టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌ సహా అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు బుధవారం తెలిపాడు. 35 ఏళ్ల పార్థివ్‌ టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు కలిపి 1706 పరుగులు.. 93 క్యాచ్‌లు, 19 స్టంపిం‍గ్స్‌ చేశాడు.ఇక దేశవాలి క్రికెట్‌లో గుజరాత్‌ తరపున 194 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడాడు. 2002లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే ద్వారా పార్థివ్‌ పటేల్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.  టెస్టు క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో( 17 సంవత్సరాల 153 రోజులు) అరంగేట్రం చేసిన ఆటగాడిగా పార్థివ్‌ అప్పట్లో రికార్డు సృష్టించాడు.  ఆరంభంలో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడినా అదే ప్రదర్శను చూపించలేకపోయాడు.

అదే సమయంలో దినేష్‌ కార్తిక్‌, ఎంఎస్‌ ధోనిలు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టడంతో పార్థివ్‌ కెరీర్‌ డౌన్‌ఫాల్‌ మొదలైంది. ముఖ్యంగా ధోని అన్ని ఫార్మాట్లకు రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌గా మారిన తర్వాత పార్థివ్‌కు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక పార్థివ్‌ తన చివరి టెస్టు మ్యాచ్‌ను 2018లో దక్షిణాఫ్రికాతో ఆడగా.. 2012లో ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడాడు. ఐపీఎల్‌లో పార్థివ్‌ పటేల్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌, డెక్కన్‌ చార్జర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

Videos

52 మందితో మోడీ క్యాబినెట్

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి

ఫిల్మ్ సిటీలో రామోజీ రావు అంత్యక్రియలు

ఓటమిపై సీదిరి అప్పలరాజు షాకింగ్ కామెంట్స్

ఫ్యాన్స్ ను డిస్సపాయింట్ చేస్తున్న శంకర్...

కేంద్రం నుండి రామ్మోహన్ రాయుడు, పెమ్మసాని ఫోన్ కాల్

డ్రాగన్ కంట్రీ కుట్రలో మాల్దీవులు..!?

పుష్ప2 Vs వేదా మూవీ బిగ్ క్లాష్..

మకాం మారుస్తున్న శ్రీలీల..

Photos

+5

Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్‌ (ఫోటోలు)

+5

పాక్‌లో ప్రముఖ ఆలయాలు (ఫొటోలు)

+5

కల నెరవేరుతున్న వేళ.. పట్టలేనంత సంతోషంలో బిగ్‌బాస్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

అర్జున్‌ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)

+5

మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్‌ (ఫొటోలు)

+5

Mayank Agarwal : కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టీమిండియా క్రికెటర్ ‘మయాంక్ అగర్వాల్’ (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ నేతలు (ఫొటోలు)

+5

ఈ హీరోయిన్‌ మనసు బంగారం.. మీరు కూడా ఒప్పుకోవాల్సిందే! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో గోవా బీచ్‌లో చిల్‌ అవుతున్న యాంకర్‌ లాస్య (ఫోటోలు)