Breaking News

Europe Smash 2025: మనికపై శ్రీజ పైచేయి 

Published on Tue, 08/19/2025 - 06:03

మాల్మో (స్వీడన్‌): యూరోప్‌ స్మాష్‌ వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) టోర్నీలో తెలంగాణ అమ్మాయి, భారత నంబర్‌వన్‌ ఆకుల శ్రీజ శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రపంచ 45వ ర్యాంకర్‌ శ్రీజ 5–11, 11–9, 15–13, 10–12, 11–8తో భారత్‌కే చెందిన ప్రపంచ 52వ ర్యాంకర్‌ మనిక బత్రాపై విజయం సాధించింది. 44 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇద్దరూ ప్రతి పాయింట్‌ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. 

చివరకు కీలకదశలో పాయింట్లు నెగ్గిన శ్రీజను విజయం వరించింది. శ్రీజ మొత్తం 52 పాయింట్లు సాధించగా... అందులో తన సర్విస్‌లో 27 పాయింట్లు, ప్రత్యర్థి సర్విస్‌లో 25 పాయింట్లు సంపాదించింది. మనిక బత్రా మొత్తం 53 పాయింట్లు గెలవగా... అందులో తన సర్విస్‌లో 28, ప్రత్యర్థి సర్విస్‌లో 25 పాయింట్లు సాధించింది. భారత్‌కే చెందిన ప్రపంచ 77వ ర్యాంకర్‌ యశస్విని తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. యశస్విని 6–11, 2–11, 1–11తో ఐదో ర్యాంకర్‌ వాంగ్‌ యిది (చైనా) చేతిలో ఓడిపోయింది.  

మానవ్‌ సంచలనం 
ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత నంబర్‌వన్, ప్రపంచ 43వ ర్యాంకర్‌ మానవ్‌ ఠక్కర్‌ సంచలన విజయంతో శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో మానవ్‌ 12–10, 11–5, 5–11, 11–9తో ప్రపంచ 23వ ర్యాంకర్‌ హిరోటో షినోజుకా (జపాన్‌)ను బోల్తా కొట్టించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించాడు.    

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)