Breaking News

ప్రేక్షకులకు ప్రవేశం ఉచితం

Published on Wed, 12/18/2024 - 03:17

న్యూఢిల్లీ: ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకులను ఉచితంగా అనుమతించాలని లీగ్‌ నిర్వాహకులు నిర్ణయించారు. ఆటను అభిమానులకు చేరువ చేసేందుకు ఇది సరైన మార్గం అని హెచ్‌ఐఎల్‌ గవర్నింగ్‌ కమిటీ చైర్మన్‌ దిలీప్‌ టిర్కీ పేర్కొన్నాడు. డిసెంబర్‌ 28 నుంచి రూర్కేలాలోని బిర్సా ముండా స్టేడియంలో పురుషుల హెచ్‌ఐఎల్‌ ప్రారంభం కానుంది. 

మొత్తం 8 జట్లు పాల్గొననున్న ఈ లీగ్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న జరగనున్న ఫైనల్‌తో ముగియనుంది. మరోవైపు రాంచీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 12 నుంచి 26 మధ్య నిర్వహించనున్న మహిళల హెచ్‌ఐఎల్‌ లీగ్‌లో 4 జట్లు పాల్గొంటున్నాయి. 

‘టికెట్ల విక్రయంతో డబ్బు సంపాదించడంకన్నా... ఆటను అభిమానులకు చేరువ చేయడం ముఖ్యం. ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూసే అనుభూతి ప్రతి ఒక్కరూ పొందాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని హాకీ ఇండియా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

‘మైదానాల్లోకి ఉచిత ప్రవేశం కల్పించడంతో ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా... ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయి పోరాటాలను నేరుగా వీక్షించే అవకాశం ఉంది’ అని హెచ్‌ఐఎల్‌ గవరి్నంగ్‌ కమిటీ చైర్మన్‌ దిలీప్‌ టిర్కీ అన్నాడు.  

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య