Breaking News

శభాష్‌ స్వితోలినా

Published on Mon, 06/02/2025 - 01:15

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ విభాగంలో సంచలనం చోటు చేసుకుంది. టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకరైన ఇటలీ స్టార్, ప్రపంచ నాలుగో ర్యాంకర్, నాలుగో సీడ్‌ జాస్మిన్‌ పావోలిని ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది. ఉక్రెయిన్‌ సీనియర్‌ ప్లేయర్‌ ఎలీనా స్వితోలినా అద్భుత పోరాటపటిమ కనబరిచి జాస్మిన్‌ పావోలినిని బోల్తా కొట్టించింది. మూడు సార్లు మ్యాచ్‌ పాయింట్లను కాచుకొని స్వితోలినా గెలుపొందడం విశేషం. 

కెరీర్‌లో 12వసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడుతోన్న 13వ సీడ్‌ స్వితోలినా తాజా విజయంతో ఐదోసారి ఈ మెగా టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ దశకు అర్హత సాధించింది. 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన పోరులో స్వితోలినా 4–6, 7–6 (8/6), 6–1తో జాస్మిన్‌ను ఓడించి క్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ స్వియాటెక్‌తో పోరుకు సిద్ధమైంది. తొలి సెట్‌ కోల్పోయిన స్వితోలినా రెండో సెట్‌లో 3–5తో వెనుకబడింది. ఎనిమిదో గేమ్‌లో జాస్మిన్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన స్వితోలినా ఆధిక్యాన్ని 4–5కు తగ్గించింది. 

తొమ్మిదో గేమ్‌లో స్వితోలినా సర్వీస్‌లో జాస్మిన్‌ విజయానికి రెండు పాయింట్ల దూరంలో నిలిచింది. అయితే ఈ రెండింటిని కాపాడుకున్న స్వితోలినా తన సర్వీస్‌ను నిలబెట్టుకొని స్కోరును 5–5తో సమం చేసింది. అనంతరం స్కోరు 6–6తో సమం కావడంతో సెట్‌ టైబ్రేకర్‌కు దారి తీసింది. టైబ్రేక్‌లో జాస్మిన్‌ 6–5తో ఆధిక్యంలో నిలిచి విజయానికి పాయింట్‌ దూరంలో నిలిచింది. 

ఈసారీ స్వితోలినా సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా మూడు పాయింట్లు గెలిచి సెట్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో స్వితోలినా చెలరేగిపోయి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే జోరులో సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో జాస్మిన్‌ తన సర్వీస్‌ను ఏడుసార్లు, స్వితోలినా ఆరుసార్లు కోల్పోయారు.  

స్వియాటెక్‌ వరుసగా ఆరోసారి... 
మరోవైపు డిఫెండింగ్‌ చాంపియన్, ఐదో సీడ్‌ ఇగా స్వియాటెక్‌ వరుసగా ఆరోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గత మూడేళ్లలో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు ప్రిక్వార్టర్‌ ఫైనల్లో గట్టిపోటీ ఎదురైంది. 12వ సీడ్‌ రిబాకినా (కజకిస్తాన్‌)తో జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్‌ 1–6, 6–3, 7–5తో నెగ్గి ముందంజ వేసింది. అరంటా సాంచెజ్‌ వికారియో (స్పెయిన్‌; 1991 నుంచి 2000 వరకు; 10 సార్లు) తర్వాత ఫ్రెంచ్‌ ఓపెన్‌లో వరుసగా ఆరు లేదా అంతకంటే ఎక్కువసార్లు క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన రెండో ప్లేయర్‌గా స్వియాటెక్‌ గుర్తింపు పొందింది.

రిబాకినాతో 2 గంటల 30 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్‌ రెండు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. నాలుగుసార్లు తన సర్వీస్‌ను కోల్పోయినా స్వియాటెక్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను కూడా నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. 33 విన్నర్స్‌ కొట్టిన స్వియాటెక్‌ నెట్‌వద్దకు 11 సార్లు దూసుకొచ్చి ఎనిమిదిసార్లు పాయింట్లు గెలిచింది.  

సబలెంకా జోరు  
ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ సబలెంకా (బెలారస్‌), ఎనిమిదో సీడ్‌ కిన్‌వెన్‌ జెంగ్‌ (చైనా) కూడా క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నారు. సమ్సనోవా (రష్యా)తో 2 గంటల 47 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో కిన్‌వెన్‌ జెంగ్‌ 7–6 (7/5), 1–6, 6–3తో గెలిచి తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. సబలెంకా 7–5,6 –3తో అనిసిమోవా (అమెరికా)ను ఓడించింది. తద్వారా సెరెనా విలియమ్స్‌ (అమెరికా) తర్వాత వరుసగా పదిసార్లు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్న ప్లేయర్‌గా ఈ బెలారస్‌ స్టార్‌ ఘనత వహించింది.  

బోపన్న, యూకీ జోడీలు అవుట్‌ 
ఫ్రెంచ్‌ ఓపెన్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌ విభాగంలో రోహన్‌ బోపన్న, యూకీ బాంబ్రీ జోడీలు మూడో రౌండ్‌లో నిష్క్రమించాయి. బోపన్న (భారత్‌)–ఆడమ్‌ పావ్లాసెక్‌ (చెక్‌ రిపబ్లిక్‌) ద్వయం 2–6, 6–7 (5/7)తో రెండో సీడ్‌ హ్యారీ హెలియోవారా (ఫిన్‌లాండ్‌)–హెన్రీ ప్యాటెన్‌ (బ్రిటన్‌) జోడీ చేతిలో ఓడిపోయింది.

యూకీ బాంబ్రీ (భారత్‌)–రాబర్ట్‌ గాలోవే (అమెరికా) జంట 4–6, 4–6తో తొమ్మిదో సీడ్‌ క్రిస్టియన్‌ హారిసన్‌–ఇవాన్‌ కింగ్‌ (అమెరికా) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. మూడో రౌండ్‌లో ఓడిన బోపన్న, యూకీ జోడీలకు 43,500 యూరోల (రూ. 42 లక్షల 22 వేలు) చొప్పున ప్రైజ్‌మనీ లభించింది. మరోవైపు బాలుర సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో మానస్‌ ధామ్నె (భారత్‌) 5–7, 3–6తో రోనిత్‌ కర్కీ (అమెరికా) చేతిలో ఓటమి పాలయ్యాడు.   

జొకోవిచ్‌ ముందుకు 
పురుషుల సింగిల్స్‌ విభాగంలో మాజీ చాంపియన్, సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మూడో రౌండ్‌ మ్యాచ్‌లో జొకోవిచ్‌ 6–3, 6–4, 6–2తో ఫిలిప్‌ మిసోలిచ్‌ (ఆ్రస్టియా)పై గెలుపొందాడు. 2 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఆరు ఏస్‌లు సంధించాడు. 

ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు. అమెరికా ప్లేయర్, ప్రపంచ 12వ ర్యాంకర్‌ టామీ పాల్‌ తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ చేరుకున్నాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో టామీ పాల్‌ 6–3, 6–3, 6–3తో పాపిరిన్‌ (ఆ్రస్టేలియా)పై విజయం సాధించాడు.  

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)