Breaking News

సూపర్‌ కింగ్స్‌ చిత్తు.. ఫైనల్‌కు చేరిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌

Published on Fri, 02/09/2024 - 07:33

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2024లో డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ ఫైనల్లో అడగుపెట్టింది. గురువారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన జెయింట్స్‌.. తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 

డర్బన్‌ బ్యాటర్లలో హెన్రిస్‌ క్లాసెన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 30 బంతుల్లోనే 7 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. అతడితో వియాన్‌ ముల్డర్‌(50) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లలో నంద్రే బర్గర్‌, బ్రెస్‌వెల్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సామ్‌ కుక్‌, గాలైం తలా వికెట్‌ సాధించారు. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌ కింగ్స్‌ 17.4 ఓవర్లలో 142 పరుగులకే చాపచుట్టేసింది.

సూపర్‌ కింగ్స్‌ బ్యాటర్లలో మొయిన్‌ అలీ(30) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. డర్బన్‌ బౌలర్లలో జూనియర్‌ డాలా 4 వికెట్లతో సూపర్‌ కింగ్స్‌ పతనాన్ని శాసించగా.. నవీన్‌ ఉల్‌ హాక్‌, ప్రిటోరియస్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు.  ఇక ఫిబ్రవరి 10న కేప్‌టౌన్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, డర్బన్ సూపర్ జెయింట్స్ తాడొపేడో తెల్చుకోనున్నాయి.
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)