Breaking News

సన్ రైజర్స్‌తో తెగదెంపులు.. కట్ చేస్తే! ఇప్పుడు ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపిక

Published on Sat, 09/13/2025 - 17:14

సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 సీజ‌న్‌కు ముందు డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ కెప్టెన్‌గా స్టార్ బ్యాట‌ర్ ఐడైన్ మార్‌క్ర‌మ్ ఎంపిక‌య్యాడు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ ప్ర‌క‌ట‌న చేసింది. గత సీజన్‌లో డర్బన్‌ కెప్టెన్‌గా వ్యహరించిన కేశవ్‌ మహారాజ్‌ స్ధానాన్ని మార్‌క్రమ్‌ భర్తీ చేయనున్నాడు. ఇటీవ‌ల జ‌రిగిన వేలంలో మార్‌క్ర‌మ్‌ను రూ.7 కోట్ల భారీ ధ‌ర‌కు డ‌ర్బ‌న్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. 

ఎస్ఎ టీ20 తొట్ట తొలి సీజ‌న్ నుంచి  సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌కు ప్రాతినిథ్యం వ‌హించిన మార్‌క్ర‌మ్‌.. నాలుగో సీజ‌న్‌కు ముందు ఆ జ‌ట్టుతో తెగ‌దింపులు చేసుకున్నాడు. దీంతో వేలంలోకి వ‌చ్చిన ఈ సౌతాఫ్రికా టీ20 కెప్టెన్ కోసం చాలా ఫ్రాంచైజీలు పోటీప‌డ్డాయి. 

రెండు సార్లు ఛాంపియ‌న్ అయిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సైతం అత‌డి సొంతం చేసుకోవాల‌ని భావించింది. అందుకు కోసం మార్‌క్ర‌మ్‌పై రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించాలని చూసింది. కానీ డ‌ర్బ‌న్ మాత్రం వారి పోటీగా భారీ మొత్తాన్ని పెంచుకుంటూ పోతూ మార్‌క్ర‌మ్‌ను సొంతం చేసుకుంది. 

కాగా డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు.. ఐపీఎల్‌కు చెందిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సిస్ట‌ర్‌ ఫ్రాంచైజీ కావ‌డం గ‌మనార్హం. ఐపీఎల్‌లో మార్‌క్ర‌మ్‌కు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ల‌క్నో యాజ‌మాన్యం మార్‌క్ర‌మ్‌కు త‌మ డ‌ర్బ‌న్ జ‌ట్టు ప‌గ్గాల‌ను అప్ప‌గించింది.

సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మార్‌క్ర‌మ్‌కు అద్బుత‌మైన రికార్డు ఉంది. కెప్టెన్‌గా రెండు సార్లు స‌న్‌రైజ‌ర్స్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపాడు. డ‌ర్బ‌న్ సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టులో హెన్రిచ్ క్లాసెన్, సునీల్ నరైన్, జోస్ బట్లర్, డెవాన్ కాన్వే వంటి సూప‌ర్ స్టార్లు ఉన్నారు. ఈ ఎస్ఎ టీ20 నాలుగో ఎడిష‌న్ ఈ ఏడాది డిసెంబ‌ర్ 26 నుంచి ప్రారంభం కానుంది. గ‌త సీజ‌న్ ఛాంపియ‌న్‌గా ఎంఐ కేప్‌టౌన్‌ జట్టు నిలిచింది. 

డర్బన్‌ సూపర్‌ జెయింట్స్‌ జట్టు
నూర్ అహ్మద్, హెన్రిచ్ క్లాసెన్, సునీల్ నరైన్, జోస్ బట్లర్, క్వేనా మఫాకా, ఐడెన్ మార్క్రమ్‌, డెవాన్ కాన్వే, గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ బెడింగ్‌హామ్, మార్క్వెస్ అకెర్‌మాన్, ఈథన్ బాష్, ఆండిలే సిమెలానే, టోనీ డీ జోర్జి, డయాన్‌ గలీమ్‌, తైజుల్‌ ఇస్లాం, ఎవాన్‌ జోన్స్‌, గిస్‌బెర్ట్‌ వేజ్‌, డేవిడ్‌ వీస్‌, డారిన్‌ డుపావిలోన్‌.



 

 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు