Breaking News

డుప్లెసిస్ విధ్వంసం.. టాప్‌లోకి సూప‌ర్ కింగ్స్‌

Published on Sun, 07/06/2025 - 14:06

మేజ‌ర్ లీగ్ క్రికెట్‌-2025 లీగ్ స్టేజీని టెక్సాస్ సూప‌ర్ కింగ్స్ అద్బుత‌మైన విజ‌యంతో ముగించింది. ఆదివారం ఫ్లోరిడా వేదిక‌గా సియాటెల్ ఓర్కాస్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో సూప‌ర్ కింగ్స్ జ‌య‌భేరి మ్రోగించింది.

ఈ విజ‌యంతో టెక్సాస్ జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర‌స్దానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టెక్సాస్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌(52 బంతుల్లో 6 ఫోర్లు,4 సిక్స్‌ల‌తో 91), శుభమ్‌ రంజనె (41 బంతుల్లో 4 ఫోర్లు,  3 సిక్స్‌ల‌తో 65 నాటౌట్‌) విధ్వంస‌క‌ర హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు.

అనంతరం లక్ష్య ఛేదనలో సియాటెల్ 18.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌటైంది. కేల్ మయేర్స్ (35), షిమ్రోన్ హెట్‌మయెర్ (26), సికందర్ రజా (23) రాణించినా.. మిగితా ప్లేయర్లు విఫలం కావడంతో ఓర్కాస్‌ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. 

టెక్సాస్ బౌలర్లలో ఆడమ్ మిల్నే 5 వికెట్లు పడగొట్టి సియాటెల్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు నూర్ అహ్మద్ 2, అకీల్ హోసేన్ 2, మార్కస్ స్టాయినిస్ ఒక వికెట్ తీశారు. ఇక ఈ ఓటమితో సియాటెల్‌((6 పాయింట్లు) ప్లే ఆఫ్స్‌ ఆశలు గల్లంతయ్యాయి. 

ఇప్పటికే టెక్సాస్‌, శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్, వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ జట్లు తమ ప్లే ఆఫ్‌ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాయి. మిగిలిన నాలుగో స్ధానం కోసం ఎంఐ న్యూయర్క్‌, సియాటెల్‌ పోటీలో ఉన్నాయి. న్యూయార్క్‌ తన చివరి లీగ్ మ్యాచ్‌లో (వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌తో పోరు) ఘోర ఓటమిపాలైతేనే సియాటెల్‌కు నాలుగో బెర్తు దక్కే అవకాశం ఉంది. ఇది జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)