Breaking News

నిజమైన వయస్సును వెల్లడించాల్సిందే.. లేదంటే కఠిన చర్యలు

Published on Fri, 03/14/2025 - 15:32

న్యూఢిల్లీ: క్రీడా పోటీల్లో తరచూ వివాదాస్పదమవుతున్న తప్పుడు వయో ధ్రువీకరణ అంశంపై నిర్దిష్టమైన పాలసీని రూపొందిస్తున్న కేంద్ర క్రీడా శాఖ ఇందులో సాధారణ ప్రజల్ని భాగం చేయాలని నిర్ణయించింది.

క్రీడల్లో నకిలీ వయో ధ్రువీకరణ నిరోధక జాతీయ పాలసీ (ఎన్‌సీఏఏఎఫ్‌ఎస్‌) ముసాయిదా బిల్లును రూపొందించిన క్రీడా శాఖ తుది సవరణలు, అభ్యంతరాల స్వీకరణ కోసం ఈ నెలాఖరు (31) వరకు సాధారణ ప్రజానీకం అభిప్రాయాలు, ఫిర్యాదులను సేకరించనుంది.

‘నూతన క్రీడల్లో వయో ధ్రువీకరణ పాలసీపై క్రీడలు–యువజన సర్వీసుల శాఖ తుది కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సలహాలు సంప్రదింపులు జరుపుతుంది. ప్రజలు కూడా భాగం కావొచ్చు. ఆయా వయో విభాగాల క్రీడల్లో నిజమైన వయస్సు కలిగిన క్రీడాకారులకు నష్టం కలుగకుండా చూడటమే ఈ బిల్లు లక్ష్యం’ అని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 

చట్టాలకు లోబడి శిక్షలు
భారత క్రీడల్లో మరింత జవాబుదారీతనం పెంచడం కోసం నిర్దిష్టమైన సవరణలతో 15 ఏళ్ల తర్వాత ఈ బిల్లును తీసుకొస్తున్నట్లు క్రీడాశాఖాధికారులు తెలిపారు. తప్పుడు, నకిలీ ధ్రువీకరణతో పోటీల్లో పాల్గొంటే తొలిసారి రెండేళ్ల నిషేధం విధిస్తారు. 

పతకాల్ని వెనక్కి తీసుకుంటారు. రెండోసారి పునరావృతం జీవితకాల నిషేధం విధించడంతో పాటు, చట్టాలకు లోబడి శిక్షలు తప్పవు. అయితే సస్పెన్షన్‌కు గురైన అథ్లెట్లు తమ తప్పుని అంగీకరించి, నిజమైన వయస్సును వెల్లడిస్తే క్షమాభిక్షకు అవకాశమిచ్చారు.   

ఇదీ చదవండి
చండీగఢ్‌లో గురువారం జరిగిన పంజాబ్‌ యూనివర్సిటీ (పీయూ) స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా.. మేటి షూటర్‌ మనూ భాకర్‌ ‘పీయూ ఖేల్‌రత్న’ పురస్కారం అందుకుంంది. గత ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు నెగ్గిన మనూ భాకర్‌ ఈ ఏడాది చండీగఢ్‌లోని డీఏవీ కాలేజీ నుంచి మాస్టర్స్‌ డిగ్రీ సాధించింది.    
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)