Breaking News

రష్మిక జోడీకి డబుల్స్‌ టైటిల్‌... సింగిల్స్‌ చాంపియన్‌ రామ్‌కుమార్‌

Published on Mon, 12/04/2023 - 03:46

అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నమెంట్‌లో భారత క్రీడాకారులు రాణించారు. అహ్మదాబాద్‌లో జరిగిన వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌ టో ర్నీలో మహిళల డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక భారత్‌కే చెందిన వైదేహితో కలిసి టైటిల్‌ సొంతం చేసుకుంది.

డబుల్స్‌ ఫైనల్లో రష్మిక –వైదేహి ద్వయం 6–1, 6–2తో సోహా సాదిక్‌–ఆకాంక్ష (భారత్‌) జోడీపై గెలిచింది. 55 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రష్మిక జోడీ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసింది. సింగిల్స్‌ విభాగంలో రష్మిక పోరాటం సెమీఫైనల్లో ముగిసింది.

మరోవైపు కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగిన ఐటీఎఫ్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత ప్లేయర్‌ రామ్‌కుమార్‌ రామనాథన్‌ విజేతగా అవతరించాడు. ఫైనల్లో రామ్‌కుమార్‌ 6–2, 6–1తో డేవిడ్‌ పిచ్లార్‌ (ఆ్రస్టియా)పై నెగ్గాడు. రెండు నెలల వ్యవధిలో రామ్‌కుమార్‌కిది మూడో ఐటీఎఫ్‌ సింగిల్స్‌ టైటిల్‌ కావడం విశేషం. 

#

Tags : 1

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)