Breaking News

‘పరాయి స్త్రీలను తాకను’.. ఇంత పొగరు పనికిరాదు!

Published on Mon, 01/27/2025 - 12:11

టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్లో(Tata Steel Chess Tournament) ఉజ్బెకిస్తాన్‌ గ్రాండ్‌ మాస్టర్‌ నొదిర్‌బెక్‌ యకుబొయేవ్‌(Nodirbek Yakubboev) వ్యవహరించిన తీరు వివాదానికి దారి తీసింది. భారత గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌.వైశాలి(R Vaishali)తో గేమ్‌ సందర్భంగా నొదిర్‌బెక్‌ ఆమెతో కరచాలనం చేయడానికి నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

క్షమించండి
ఈ నేపథ్యంలో నొదిర్‌బెక్‌ ‘ఎక్స్‌’ వేదికగా క్షమాపణలు తెలిపాడు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ కించపరచలేదని.. తన వల్ల తెలిసోతెలియకో పొరపాటు జరిగి ఉంటే క్షమించాలని కోరాడు. అయినప్పటికీ అతడి వ్యవహార శైలిపై మాత్రం విమర్శలు ఆగటం లేదు. 

ఇంత పొగరు పనికిరాదు
ద్వంద్వ ప్రమాణాలు పాటించే వారు ఎప్పటికీ ఉన్నత శిఖరాలకు చేరుకోలేరంటూ నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మత విశ్వాసాల పేరిట మహిళల పట్ల వివక్ష చూపించడం తగదంటూ హితవు పలుకుతున్నారు. ఇంత పొగరు పనికిరాదంటూ మండిపడుతున్నారు.

అసలేం జరిగిందంటే.. నెదర్లాండ్స్‌లోని విక్‌ ఆన్‌ జీ వేదికగా టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా నాలుగో రౌండ్‌లో ఆర్‌.వైశాలితో నొదిర్‌బెక్‌ ముఖాముఖి తలపడ్డాడు. 

అయితే, ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్న నొదిర్‌బెక్‌.. గేమ్‌ ఆరంభం కావడానికి ముందు కర్టెసీలో భాగంగా వైశాలి కరచాలనం చేసేందుకు చేయి ముందుకుచాచగా.. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అవసరం లేదన్నట్లుగా సైగ చేస్తూ తన కుర్చీలో కూర్చున్నాడు.

విజయం తర్వాత షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు
ఇక ఈ గేమ్‌లో నొదిర్‌బెక్‌పై వైశాలి గెలుపొందింది. గేమ్‌కు ముందు ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని విజయం తర్వాత అతడికి షేక్‌ హ్యాండ్‌ ఆఫర్‌ చేయకుండా మిన్నకుండిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టగా.. నొదిర్‌బెక్‌ తాను కావాలని ఇలా చేయలేదంటూ సంజాయిషీ ఇచ్చుకున్నాడు.

పరాయి స్త్రీలను తాకను
‘‘ఇండియాలోని ప్రతిభావంతులైన చెస్‌ క్రీడాకారులైన వైశాలి, ఆమె సోదరుడు ప్రజ్ఞానందల పట్ల నాకు గౌరవం ఉంది. నా ప్రవర్తన వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే.. క్షమించండి. నాకు ఏది సరైంది అనిపిస్తే అదే చేస్తాను.

పరాయి స్త్రీలతో నేను కరచాలనం చేయలేను. ఇక మహిళలు హిజాబ్‌ లేదంటే బుర్ఖా ధరించాలా లేదా అన్నవి పూర్తిగా వారి నిర్ణయాలు. 2023లో దివ్యతో నేను పొరపాటుగా అలా వ్యవహరించాను. ఈరోజు గేమ్‌ ఆడేటపుడు నా ప్రత్యర్థి బుల్మాగాకు ముందే చెప్పాను.

షేక్‌ హ్యాండ్‌ నాకు ఇష్టం ఉండదని. తను అందుకు అంగీకరించింది. అయితే, కొంతమంది మర్యాదపూర్వక పలకరింపునకు చిహ్నంగా నమస్తే అయినా చెప్పాలని కోరారు. ఏదేమైనా.. దివ్య, వైశాలిలతో గేమ్‌లకే ముందే నేను మహిళలతో షేక్‌ హ్యాండ్‌కు విరుద్ధం అని చెప్పి ఉంటే.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండేది కాదు’’ అని నొదిర్‌బెక్‌ వివరణ ఇచ్చాడు. 

కాగా అంతకుముందు మరో భారత గ్రాండ్‌మాస్టర్‌ దివ్యతో గేమ్‌కు ముందు ఆమె ముంజేయికి ముంజేయి తాకించి.. విష్‌ చేశాడు.   ఇక చెన్నైకి చెందిన చెస్‌ సంచలనం ఆర్‌.ప్రజ్ఞానందకు తోడబుట్టిన అక్క వైశాలి అన్న విషయం తెలిసిందే. 

ఈ ఇద్దరు గ్రాండ్‌మాస్టర్లు ప్రస్తుతం టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌తో బిజీగా ఉన్నారు. మరోవైపు.. 23 ఏళ్ల నొదిర్‌బెక్‌ 2019లో గ్రాండ్‌ మాస్టర్‌ హోదా పొందగా.. 23 ఏళ్ల వైశాలి  ప్రపంచ బ్లిట్జ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ ప్లేయర్‌గా ఇటీవలే చరిత్ర సృష్టించింది. 

చదవండి: షమీ రీఎంట్రీ.. మళ్లీ వాయిదా?!.. గంభీర్‌తో సమస్యా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)