Breaking News

చాంపియన్‌ గుకేశ్‌ 

Published on Tue, 04/18/2023 - 08:15

Menorca Chess Open 2023- చెన్నై: భారత టీనేజ్‌ గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌ మెనోర్కా ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో వరుసగా రెండో ఏడాది టైటిల్‌ సాధించాడు. స్పెయిన్‌లో జరిగిన ఈ టోర్నీలో నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత గుకేశ్‌తోపాటు మరో తొమ్మిదిమంది ఏడు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.

మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... గుకేశ్, ప్రణవ్‌లకు తొలి రెండు ర్యాంక్‌లు లభించాయి. విజేతను నిర్ణయించేందుకు గుకేశ్, ప్రణవ్‌ మధ్య రెండు బ్లిట్జ్‌ టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు. తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల గుకేశ్‌ 1.5–0.5తో ప్రణవ్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచాడు.

గుకేశ్‌కు 3,000 యూరోలు (రూ. 2 లక్షల 69 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొమ్మిది రౌండ్లలో గుకేశ్‌ ఐదు గేముల్లో గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. ఇదే టోర్నీలో పాల్గొన్న తెలంగాణ ప్లేయర్లు హర్ష భరతకోటి 6.5 పాయింట్లతో 11వ ర్యాంక్‌లో, వుప్పాల ప్రణీత్‌ 6 పాయింట్లతో 19వ ర్యాంక్‌లో, రాజా రిత్విక్‌ 5.5 పాయింట్లతో 37వ ర్యాంక్‌లో నిలిచారు.    

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)