Breaking News

దోహా డైమండ్‌ లీగ్‌ మీట్‌: నీరజ్‌ చోప్రాకు అగ్ర స్థానం... పారిస్‌ ఒలింపిక్స్‌కూ అర్హత

Published on Sat, 05/06/2023 - 05:07

ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌ మీట్‌ సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి దోహా వేదికగా జరిగిన తొలి సిరీస్‌లో భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మెరిశాడు. ఎనిమిది మంది మేటి
జావెలిన్‌ త్రోయర్లు పోటీపడిన ఈ మీట్‌లో నీరజ్‌ చోప్రా బల్లెంను 88.67 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ ప్రదర్శనతో నీరజ్‌ వచ్చే ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌ క్రీడలకు కూడా అర్హత సాధించాడు. జావెలిన్‌ ఈవెంట్‌లో పారిస్‌ ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణం 85.50 మీటర్లు. నీరజ్‌ ఈ దూరాన్ని తొలి ప్రయత్నంలోనే నమోదు చేశాడు. 

ఆ తర్వాత నీరజ్‌ 86.04 మీటర్లు, 85.47 మీటర్లు, 84.47 మీటర్లు, 86.52 మీటర్లు నమోదు చేశాడు. ఐదో ప్రయత్నంలో నీరజ్‌ ఫౌల్‌ చేశాడు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ పీటర్స్‌ అండర్సన్‌ (గ్రెనెడా; 85.88 మీటర్లు) రెండో స్థానంలో... జాకుబ్‌ వాద్లెచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌; 88.63 మీటర్లు) మూడో స్థానంలో నిలిచారు. ఇదే మీట్‌లో పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో పోటీపడిన భారత అథ్లెట్‌ ఎల్డోజ్‌ పాల్‌ 15.84 మీటర్ల దూరం దూకి పదో స్థానంలో నిలిచాడు. డైమండ్‌ లీగ్‌లో మొత్తం 14 సిరీస్‌లు జరుగుతాయి. అనంతరం సెప్టెంబర్‌లో గ్రాండ్‌ ఫైనల్‌ను నిర్వహిస్తారు.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు