Breaking News

పదోసారి ఫైనల్లో జొకోవిచ్‌

Published on Sat, 07/13/2024 - 04:10

లండన్‌: రికార్డుస్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్‌ కోసం సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ విజయం దూరంలో నిలిచాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో రెండో సీడ్‌ జొకోవిచ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో జొకోవిచ్‌ 2 గంటల 48 నిమిషాల్లో 6–4, 7–6 (7/2), 6–4తో 25వ సీడ్‌ లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై గెలుపొందాడు. ఈ మ్యాచ్‌లో జొకోవిచ్‌ ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేశాడు.

ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్, మూడో సీడ్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌)తో జొకోవిచ్‌ తలపడతాడు. గత ఏడాది కూడా వీరిద్దరి మధ్యే ఫైనల్‌ జరగ్గా... అల్‌కరాజ్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా వింబుల్డన్‌ టోర్నీలో జొకోవిచ్‌ ఫైనల్‌ చేరడం ఇది పదోసారి కావడం విశేషం. ఈ టోర్నీలో జొకోవిచ్‌ 2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022లలో విజేతగా నిలిచి... 2013, 2023లలో రన్నరప్‌గా నిలిచాడు. అంతకుముందు జరిగిన తొలి సెమీఫైనల్లో అల్‌కరాజ్‌ 6–7 (1/7), 6–3, 6–4, 6–4తో ఐదో సీడ్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలిచాడు. 

2 గంటల 55 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్‌కరాజ్‌ ఆరు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయిన అల్‌కరాజ్‌... మెద్వెదెవ్‌ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు. నెట్‌ వద్దకు 53 సార్లు దూసుకొచ్చిన ఈ స్పెయిన్‌ స్టార్‌ 38 సార్లు పాయింట్లు గెలిచాడు. అల్‌కరాజ్, మెద్వెదెవ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ను భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్   రోహిత్‌ శర్మ ప్రత్యక్షంగా తిలకించాడు.   

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)