Breaking News

‘నమ్మకం కోల్పోయాం’

Published on Wed, 02/19/2025 - 04:00

దోహా: ప్రపంచ టెన్నిస్‌ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ డోపింగ్‌ ఉదంతం... ఇటీవలే అతనికి విధించిన శిక్షపై సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ టెన్నిస్‌ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ), ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా)లు రెండూ పక్షపాత ధోరణితో వ్యవహరించాయని 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల చాంపియన్‌ బాహాటంగా తన అసంతృప్తిని వెలిబుచ్చాడు. ‘తాజా ఘటనతో టెన్నిస్‌ ప్లేయర్లంతా నమ్మకం కోల్పోయారు. ఎందుకంటే ఇటు ఐటీఐఏ కానీ, అటు ‘వాడా’ కానీ సహేతుకంగా వ్యవహరించలేదు. 

నిస్పక్షపాత వైఖరి కనబరచలేదు. ఈ రెండు సంస్థల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం  కానేకాదు. కచి్చతంగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా... టెన్నిస్‌ క్రీడ ఇమేజ్‌ను దిగజార్చేలా వ్యవహరించాయి. సుదీర్ఘకాలంగా నానుతున్న సినెర్‌ డోపింగ్‌ ఉదంతానికి కంటితుడుపు శిక్షతో పలికిన ముగింపు అసమంజసంగా ఉంది. ఎందుకంటే నేను ఈ విషయమై చాలా మంది ప్లేయర్లతో మాట్లాడాను. వారి అభిప్రాయలను నాతో పంచుకున్నారు. 

వాళ్లందరు కూడా రెండుసార్లు పట్టుబడిన సినెర్‌కు విధించిన మూడు నెలల శిక్షపై అసంతృప్తిగా ఉన్నారు’ అని జొకోవిచ్‌ అన్నాడు. ‘సినెర్‌–ఐటీఐఏ–వాడా’ల మధ్య కుదిరిన ఒప్పందం జరిగిన తప్పిదానికి తగిన శిక్షను ఖరారు చేయలేకపోయిందని పెదవి విరిచాడు. సినెర్‌లాగే రెండు నమూనాల్లో పాజిటివ్‌గా తేలిన స్పానిష్‌ మహిళా ఫిగర్‌ స్కేటర్‌ లౌరా బార్కెలోపై ‘వాడా’ ఏకంగా ఆరేళ్ల నిషేధం తాజాగా తెరపైకి వచ్చింది. క్రీడాలోకంలో చర్చనీయాంశమైంది. 

‘వాడా’ వివరణ ఇది... 
మాడ్రిడ్‌: డోపింగ్‌లో దొరికిన టెన్నిస్‌ స్టార్‌ సినెర్‌కు, స్పెయిన్‌ స్కేటర్‌ లౌరా బార్కెరోలకు వేర్వేరు శిక్షలు విధించడంపై  ‘వాడా’ వివరణ ఇచ్చింది. ‘ఇద్దరి నమూనాల్లో పాజిటివ్‌గా తేలినప్పటికీ లౌరా తన శరీరంలోకి నిషిద్ధ ఉత్రేరకాలు ఎలా ప్రవేశించాయో సరైన కారణాన్ని చెప్పలేకపోయింది. 

ఈ కారణాన్ని బలపరిచే రుజువు (సాక్ష్యం)ను చూపించలేదు. కానీ సినెర్‌ కావాలని తీసుకోలేదని, బహుశా తాను తీసుకున్న మెడిసిన్‌ లేదంటే మసాజ్‌కు వాడిన తైలం రూపంలో తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చని తను వాడిన మెడిసిన్‌లతో సహా సంజాయిషీ ఇచ్చాడు’ అని ‘వాడా’ తెలిపింది.   

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)