Breaking News

డ్రస్‌ మార్చుకొని ఆడు... కుదరదు!

Published on Sun, 12/29/2024 - 04:25

నేను తగ్గేదేలే... అయితే మేము ఆడించేదేలే! ఇటు చెస్‌ దిగ్గజం కార్ల్‌సన్, అటు అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఎవరికి వారు వెనక్కి తగ్గకపోవడంతో కార్ల్‌సన్‌ అర్ధాంతరంగా టోర్నీకి గుడ్‌బై చెప్పాడు. అలాగని అక్కడేదో పెద్ద ఘోరమేమీ జరగలేదు. కానీ అహం, ఆవేశం కలగలిపి చిన్న డ్రస్‌ కోడ్‌ అంశమే పెద్ద వివాదంగా మారింది. చెస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 

న్యూయార్క్‌: మాజీ ప్రపంచ చెస్‌ చాంపియన్‌ మాగ్నస్‌ కార్లసన్‌ చదరంగంలో ఎత్తులు పైఎత్తులు వేసే దిగ్గజ ఆటగాడు. ‘ఫిడే’ ప్రపంచ చెస్‌ వ్యవహారాలను చక్కబెట్టే సంస్థ. ఓ ఆటగాడు... ఓ సమాఖ్య... ఓ డ్రెస్‌ కోడ్‌... చిన్న అంశం సర్దుకుంటే పోటీల ఫలితాలు మీడియాలో వచ్చేవి. కానీ ఆ అంశం కాస్త వివాదంగా... చివరకు చినికి చినికి గాలివానలా మారి పెద్దవార్త అయ్యింది. 

ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే) పంతానికే పోయాడు. అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య మాత్రం ఎంతవారైనా ‘ఫిడే’ నియమావళినే సుప్రీమ్‌ అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేయడంతో ఆటగాడు, సమాఖ్య వైరిపక్షాలుగా మారాయి. ఫిడే క్రమశిక్షణ చర్యలు చేపట్టడంతో... మీరేంటి నాపై చర్యలు తీసుకునేది నేనే టోర్నీకి ఇప్పుడే ఇక్కడితోనే గుడ్‌బై చెబుతానని కార్ల్‌సన్‌ ఉన్నపళంగా నిష్క్రమించాడు.  

అసలేం జరిగింది? 
న్యూయార్క్‌లో ప్రపంచ ర్యాపిడ్‌–బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు జరుగుతున్నాయి. మన మేటి భారత గ్రాండ్‌మాస్టర్లు అర్జున్, ప్రజ్ఞానంద, ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి తదితరులు సైతం ఆడుతున్నారు. శనివారం ర్యాపిడ్‌లో ఎనిమిదో రౌండ్‌ తర్వాత డిఫెండింగ్‌ చాంపియన్, నార్వే దిగ్గజం కార్ల్‌సన్‌ జీన్స్‌ వేసుకొని చెస్‌ బోర్డు దగ్గరకు ఆడేందుకు వచ్చాడు. టోర్నీ చీఫ్‌ ఆర్బిటర్‌ అలెక్స్‌ హొలొజాక్‌ ముందుగా డ్రస్‌కోడ్‌ విషయమై నార్వే స్టార్‌కు సున్నితంగా చెప్పారు. 

జీన్స్‌ ప్యాంట్‌ ధరించి ఆడటం ఫిడే నియమావళికి విరుద్ధమని దయచేసి ప్యాంట్‌ మార్చుకొని రావాల్సిందిగా ఆర్బిటర్‌ సూచించారు. తర్వాత 200 డాలర్లు (రూ.17,078) జరిమానా విధించారు. కానీ అప్పటికప్పుడు జీన్స్‌ మార్చుకునేందుకు ఏమాత్రం ఇష్టపడని మాగ్నస్‌ ‘ఎలాగూ జీన్స్‌తో వచ్చాను కదా... ఈ రౌండ్‌ పూర్తయ్యాక మార్చుకుంటాలే’ అని చెప్పేశాడు. దీంతో ఆర్బిటర్‌ అలా అయితే ఆడించటం కుదరదని స్పష్టం చేశారు.

అయినాసరే డ్రస్‌ మార్చుకునేందుకు కార్ల్‌సన్‌ ససేమిరా అనడంతోనే వివాదం మొదలైంది. దీంతో నిబంధనలకు అనుగుణంగా అతనికి తొమ్మిదో రౌండ్‌ ప్రత్యర్థిని (పెయిరింగ్‌ ఇవ్వలేదు) కేటాయించలేదు. అంటే ఇది ఆ రౌండ్‌కు అనర్హత వేటు. ఈ క్రమశిక్షణ చర్యల్ని ఏమాత్రం సహించని కార్ల్‌సన్‌ ర్యాపిడ్‌ తొమ్మిదో రౌండే కాదు... బ్లిట్జ్‌ పోటీలు సహా మొత్తం టోర్నీనే బాయ్‌కాట్‌ చేస్తున్నానని అక్కడినుంచి నిష్క్రమించాడు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)