Breaking News

ఓటములకు ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాలి: ప్రకాశ్‌ పడుకోన్‌

Published on Tue, 08/06/2024 - 10:19

ప్యారిస్ ఒలింపిక్స్‌-2024 బ్యాడ్మింటన్‌లో భార‌త్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. బ్యాడ్మింటన్‌లో ప‌త‌కం లేకుండానే భార‌త క్రీడాకారులు ఇంటిబాట ప‌ట్టారు. పీవీ సింధు, హెచ్ ఎస్ ప్ర‌ణ‌య్‌, సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ స్టార్ షట్లర్లు క్వార్టర్స్‌లో ఓటమి చెందడంతో.. అందరి ఆశలు సెమీఫైనల్‌కు చేరిన యువ షట్లర్ లక్ష్య సేన్‌పైనే ఉండేవి. 

లక్ష్య సేన్ కూడా సెమీఫైనల్లో ఓటమి చవి చూసి నిరాశపరిచాడు. కనీసం కాంస్య పతకమైన ఈ యువ షట్లర్ సాధించాలని అందరూ ఆశించారు. కానీ కాంస్య పతకపోరులోనూ లక్ష్య సేన్ బోల్తాపడ్డాడు. 

సోమ‌వారం జ‌రిగిన కాంస్య ప‌త‌క మ్యాచ్‌లో  21–13, 16–21, 11–21తో లీ జి జియా (మలేసియా) చేతిలో ల‌క్ష్య‌సేన్‌ ఓడిపోయాడు. ఇక ఈ ఓటమిపై లక్ష్య సేన్‌ కోచ్‌ ప్రకాశ్‌ పడుకోన్ స్పందించాడు.

"పరాజయాలకు ఆటగాళ్లు కూడా బాధ్యత వహించాల్సిన సమయం వ‌చ్చింది. ఫలానా సౌకర్యాలు కావాలని అడగడమే కాదు... అవన్నీ ఇచ్చాక ఫలితాలతోపాటు పతకాలు కూడా తీసుకురావాలి. లక్ష్య సేన్‌ మరింత మెరుగవ్వాల్సి ఉంది. తప్పులు జరగడం సహజమే కానీ కోర్టులో పరిస్థితిని బట్టి ఆటను మార్చుకోవాలి. 

ఈ విషయంలో సేన్‌కు మానసికంగా కూడా కొంత శిక్షణ అవసరం. భారత బ్యాడ్మింటన్‌లో ఒకరిద్దరు టాప్‌ ఆటగాళ్లపై మాత్రమే దృష్టి పెట్టకుండా తర్వాతి స్థాయిలో వారిని కూడా తీర్చిదిద్దితేనే విజయాలు లభిస్తాయని" ప్రకాశ్‌ పడుకోన్‌ పేర్కొన్నాడు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)