వన్డే ప్రపంచకప్‌ టోర్నీకి భారత జట్టు ఇదే..? భువనేశ్వర్‌కు ఛాన్స్‌?

Published on Sat, 08/01/2026 - 13:09

టీమిండియాలోకి వెట‌ర‌న్ పేస‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ తిరిగి తీసుకోవాల‌న్న డిమాండ్‌ రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో భార‌త‌ మాజీ వికెట్ కీప‌ర్ దినేష్ కార్తీక్ చేరాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2027 టోర్నీకి త‌ను ఎంపిక చేసిన భార‌త జ‌ట్టులో భ‌వీకి కార్తీక్‌కు చోటిచ్చాడు.

అంత‌కుముందు ర‌విచంద్ర‌న్ అశ్విన్ కూడా త‌న వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో భువ‌నేశ్వ‌ర్‌కు అవ‌కాశ‌మిచ్చాడు. కాగా భువనేశ్వ‌ర్ గ‌త నాలుగేళ్లగా జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేస‌ర్ ప్ర‌స్తుతం ఐపీఎల్‌తో పాటు దేశ‌వాళీ టీ20 క్రికెట్ లీగ్స్‌లో మాత్ర‌మే ఆడుతున్నాడు.

అయితే భువీలో ఏ మాత్రం జోరు త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలోనే అత‌డిని జ‌ట్టులోకి తీసుకోవాల‌ని సెల‌క్ట‌ర్ల‌ను సూచిస్తున్నారు. కాగా దినేష్ కార్తీక్ త‌ను ఎంపిక జ‌ట్టులో భువీతో పాటు మ‌రో సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీకి ఛాన్స్ ఇచ్చాడు. ష‌మీ కూడా ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 త‌ర్వాత జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉంటున్నాడు.

ఇక డికే జ‌ట్టులో ఓపెన‌ర్ల‌గా శుబ్‌మ‌న్ గిల్‌, రోహిత్ శ‌ర్మ‌లు ఉన్నారు. బ్యాక‌ప్ ఓపెన‌ర్‌గా య‌శ‌స్వి జైశ్వాల్‌కు చోటు క‌ల్పించాడు. విరాట్ కోహ్లి, కుల్దీప్ యాద‌వ్‌, బుమ్రా వంటి సీనియ‌ర్ ప్లేయ‌ర్లు  ఇషాన్ కిష‌న్‌, నితీశ్ కుమార్ రెడ్డి వంటి యువ ఆట‌గాళ్ల‌ను కార్తీక్ ఎంపిక చేశాడు. అయితే త‌ను సెల‌క్ట్ చేసిన జ‌ట్టులో ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు చోటు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కార్తీక్ డ్రీమ్ టీమిండియా ఇదే
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)