దినేష్‌ కార్తీక్‌ విధ్వంసం.. 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో! అయినా పాపం

Published on Fri, 12/01/2023 - 17:57

విజయ్ హజారే ట్రోఫీ-2023లో తమిళనాడు తొలి ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో భాగంగా ముంబై వేదికగా జరిగిన పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో తమిళనాడు పరాజయం పాలైంది. తమిళనాడు కెప్టెన్‌, టీమిండియా వెటరన్‌ దినేష్‌ కార్తీక్‌ అద్బుతమైన పోరాట పటిమ కనబరిచనప్పటికి తన జట్టును గెలిపించలేకపోయాడు.

252 పరుగుల లక్ష్య ఛేదనలో 40 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి తమిళనాడు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన కార్తీక్‌ జట్టును అదుకున్నాడు. ఓ వైపు వికెట్లు పడతున్నప్పటికీ కార్తీక్‌ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 82 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లతో 93 పరుగులు చేశాడు. ఆఖరికి సిద్దార్ద్‌ కౌల్‌ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి క్లీన్‌ బౌల్డయ్యాడు.

దీంతో కార్తీక్‌ పోరాటం ముగిసింది. కార్తీక్‌ ఔటైన తర్వాత వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన తమిళనాడు.. 175 పరుగులకే చాపచుట్టేసింది. పంజాబ్‌ బౌలర్లలో సిద్దార్ద్‌ కౌల్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. కాగా ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న డికే.. ఐపీఎల్‌తో పాటు దేశీవాళీ క్రికెట్‌ ఆడుతున్నాడు. ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కార్తీక్‌ను రిటైన్‌ చేసుకుంది.
చదవండి: ఐపీఎల్‌-2024 షెడ్యూల్‌ విషయంలో బీసీసీఐకి తలనొప్పులు! ఈసారి ఇక్కడ కష్టమే?

Videos

ఇది ప్రజాస్వామ్యమేనా ? బాబుకు జగన్ సీరియస్ వార్నింగ్

ఖాతాదారులకు బిగ్ రిలీఫ్.. బ్యాంకు సమ్మె వాయిదా

జగన్ కోసం ప్రాణమే ఇస్తా.. ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యే సీటు ఎంత..!

సింహం సింగిల్ గానే వస్తుంది.. BC గర్జన సభలో గర్జించిన జోగి రమేష్, విడదల రజిని

ఒక్కసారి ఊహించుకో.. లక్ష 35 వేల మంది ఉద్యోగులు తిరగబడితే..

యమపాశంగా మారిన ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవే

బాబు వెన్నులో వణుకు పుట్టేలా సచివాలయ ఉద్యోగుల మాస్ వార్నింగ్

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

Photos

+5

'ఆదర్శ కుటుంబం' సాంగ్ లాంచ్‌లో డింపుల్ (ఫొటోలు)

+5

AP: సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు..!(ఫొటోలు)

+5

ఎర్రచీరలో అందంగా శోభిత చెల్లి సమంత (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)