Breaking News

RCB Vs MI: దినేష్‌ కార్తీక్‌ విధ్వంసం.. కేవలం 23 బంతుల్లోనే! వీడియో వైరల్‌

Published on Thu, 04/11/2024 - 22:37

ఐపీఎల్‌-2024లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు దినేష్‌ కార్తీక్‌ మరోసారి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో కార్తీక్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కార్తీక్‌.. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. కార్తీక్‌ తన ‍ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో అభిమానులను అలరించాడు.

ముఖ్యంగా ముంబై పేసర్‌ ఆకాష్‌ మధ్వాల్‌ను డీకే ఓ ఆట ఆడేసుకున్నాడు. ఆకాష్‌ మధ్వాల్‌ వేసిన తన ఆఖరి రెండు ఓవర్లలో కార్తీక్‌ ఏకంగా 38 పరుగులు రాబట్టాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో కేవలం 23 బంతులు మాత్రమే ఎదుర్కొన్న కార్తీక్‌.. 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అతడు ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కార్తీక్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. డీకే ది ఫినిషర్‌ అంటూ కామెంట్లు చేస్తున్నాడు.

అతడి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్‌ డుప్లెసిస్‌(61) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ముంబై బౌలర్లలో జస్ప్రీత్‌ బుమ్రా 5 వికెట్లతో చెలరేగాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)