Breaking News

దినేష్ కార్తీక్ అరుదైన ఘ‌న‌త‌.. ద్ర‌విడ్ రికార్డు బ‌ద్ద‌లు

Published on Fri, 05/10/2024 - 17:14

భార‌త వెట‌రన్ వికెట్ కీప‌ర్‌-బ్యాట‌ర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయ‌ర్‌ దినేష్ కార్తీక్ అరుదైన ఘ‌నత సాధించాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ త‌ర‌పున అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండో ఇండియ‌న్ బ్యాట‌ర్‌గా కార్తీక్ నిలిచాడు. 

ఐపీఎల్‌-2024లో భాగంగా గురువారం పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 18 ప‌రుగులు చేసిన డీకే.. ఈ రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు కార్తీక్ ఐపీఎల్‌లో బెంగ‌ళూరు త‌ర‌పున 57 మ్యాచ్‌ల్లో 912 ప‌రుగులు చేశాడు. 

ఇంత‌కుముందు ఈ రికార్డు టీమిండియా ప్ర‌స్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ పేరిట ఉండేది. ద్ర‌విడ్ 43 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ త‌ర‌పున 898 ప‌రుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో ద్ర‌విడ్ రికార్డును కార్తీక్ బ‌ద్ద‌లు కొట్టాడు. 

ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అగ్ర‌స్ధానంలో ఉన్నాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు ఆర్సీబీ త‌ర‌పున 249 మ్యాచ్‌ల్లో 7897 ప‌రుగులు చేశాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. హై స్కోరింగ్ మ్యాచ్‌లో పంజాబ్‌ను 60 ప‌రుగుల తేడాతో ఆర్సీబీ చిత్తు చేసింది. దీంతో త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను ఆర్సీబీ స‌జీవంగా నిలుపున్‌కుంది..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)