Breaking News

రైలు ప్రమాద బాధితులకు ధోనీ రూ.60 కోట్ల సాయం.. ఈ వార్తల్లో నిజమెంత?

Published on Wed, 06/07/2023 - 09:00

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 278 మంది పైగా మరణించారు. అయితే రైలు ప్రమాద బాధితులకు టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని రూ.60 కోట్ల సాయం చేస్తున్నట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. 

అయితే ఇందుకు సంబంధించి ధోని ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని, అవన్నీ రూమర్స్‌ అనే ధోని సన్నిహిత వర్గాలు కొట్టిపారేశారు. మరోవైపు విరాట్‌ కోహ్లి కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు కూడా నిజం కాదని తేలింది.

అయితే మరో టీమిండియా క్రికెటర్‌ యుజువేంద్ర చహల్ మాత్రం.. బాధిత కుటంబాలకు తన వంతుగా రూ.లక్ష విరాళం అందించాడు. రైలు ప్రమాద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చిన  "స్కౌట్" గేమింగ్ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా చహల్‌ తన సాయాన్ని అందించాడు. మరోవైపు టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు సెహ్వాగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఉచిత విద్యతో పాటు ఫ్రీ బోర్డింగ్ సదుపాయాలు కల్పిస్తానని ఈ నజఫ్‌ఘడ్‌ నవాబ్‌ ప్రకటించాడు.
చదవండి: WTC Final 2023: ప్లీజ్‌.. ఆస్ట్రేలియాను ఓడించండి! నాకు చూడాలని ఉంది: స్వాన్‌

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)