Breaking News

ధీరజ్‌ ధమాకా 

Published on Mon, 02/26/2024 - 04:25

బాగ్ధాద్‌ (ఇరాక్‌): ఆసియా కప్‌ ఆర్చరీ తొలి అంచె టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్‌ మూడు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన ధీరజ్‌ పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో, టీమ్‌ విభాగంలో, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలో విజేతగా నిలిచాడు.

వ్యక్తిగత విభాగం ఫైనల్లో ధీరజ్‌ 7–3తో భారత్‌కే చెందిన తరుణ్‌దీప్‌ రాయ్‌ను ఓడించాడు. టీమ్‌ విభాగం ఫైనల్లో ధీరజ్, తరుణ్‌దీప్‌ రాయ్, ప్రవీణ్‌ జాధవ్‌లతో కూడిన భారత జట్టు 6–2తో ఇస్లామ్, రూబెల్, అలీఫ్‌లతో కూడిన బంగ్లాదేశ్‌ జట్టుపై గెలిచింది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌ ఫైనల్లో ధీరజ్‌–సిమ్రన్‌జోడీ 6–0తో దియా–ఇస్లామ్‌ జంట (బంగ్లాదేశ్‌)పై నెగ్గింది.

ఇండియన్‌ ఆర్మీలో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ధీరజ్‌ విజయవాడలోని ఓల్గా ఆర్చరీ అకాడమీలో ఓనమాలు నేర్చుకున్నాడు. గత ఏడాది థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోరీ్నలో ధీరజ్‌ రజత పతకం సాధించి పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)