Breaking News

‘అర్జున‘ అవార్డు రేసులో ధనుశ్‌ శ్రీకాంత్, పుల్లెల గాయత్రి

Published on Thu, 12/25/2025 - 03:52

భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పుల్లెల గాయత్రి, బధిర షూటర్‌ ధనుశ్‌ శ్రీకాంత్‌ ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డును అందుకోనున్నారు. అవార్డుల ఎంపిక కోసం నియమించిన కమిటీ 24 మంది పేర్లను సిఫారసు చేసింది. వీరిలో హైదరాబాద్‌కు చెందిన గాయత్రి, శ్రీకాంత్‌లకు చోటు దక్కింది. ఈ జాబితాకు కేంద్ర ప్రభుత్వ ఆమోదముద్ర వేయడం లాంఛనమే. 

భారత బ్యాడ్మింటన్‌ జట్టు చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ కుమార్తె అయిన 22 ఏళ్ల గాయత్రి కొన్నేళ్లుగా మహిళల డబుల్స్‌లో నిలకడగా విజయాలు సాధిస్తోంది. 2022 కామన్వెల్త్‌ క్రీడల్లో రజత, కాంస్యాలు గెలిచిన భారత జట్లలో సభ్యురాలైన ఆమె...భాగస్వామి ట్రెసా జాలీతో కలిసి నాలుగు బీడబ్ల్యూఎఫ్‌ టోర్నీలు గెలిచింది. 

మరో నాలుగు టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. 23 ఏళ్ల ధనుశ్‌ శ్రీకాంత్‌ 10 మీటర్‌ ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో రెండేళ్ల క్రితం జూనియర్‌ వరల్డ్‌ కప్‌లో స్వర్ణంతో వెలుగులోకి వచ్చాడు. 2021, 2025 డెఫ్‌ ఒలింపిక్స్‌లలో కలిపి అతను మొత్తం 4 స్వర్ణాలు సాధించాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)