Breaking News

పోరాడి ఓడిన మానస్, కరణ్‌..

Published on Wed, 02/26/2025 - 09:25

బెంగళూరు: ‘వైల్డ్‌ కార్డు’తో బరిలోకి దిగిన మానస్‌ ధామ్నె, రామ్‌కుమార్‌ రామనాథన్‌... ‘క్వాలిఫ యర్‌’ హోదాలో అడుగు పెట్టిన కరణ్‌ సింగ్‌... బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ–125 చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ ‘డ్రా’ తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో మానస్‌ ధామ్నె 3–6, 6–3, 6–7 (3/7)తో పీటర్‌ బార్‌ బిర్యుకోవ్‌ (రష్యా) చేతిలో... కరణ్‌ సింగ్‌ 4–6, 6–4, 6–7 (3/7)తో జురిజ్‌ రొడియోనోవ్‌ (ఆ్రస్టియా) చేతిలో... రామ్‌కుమార్‌ రామనాథన్‌ 6–7 (3/7), 5–7తో షింటారో మొచిజుకి (జపాన్‌) చేతిలో పోరాడి ఓడిపోయారు.

బిర్యుకోవ్‌తో 1 గంట 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 17 ఏళ్ల మానస్‌ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేశాడు. అయితే టైబ్రేక్‌లో మానస్‌ తడబడి మూల్యం చెల్లించుకున్నాడు. రొడియోనోవ్‌తో 1 గంట 57 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో కరణ్‌ 11 ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. నిర్ణాయక టైబ్రేక్‌లో కరణ్‌ ఒత్తిడికి లోనై ఓటమి పాలయ్యాడు. షింటారోతో 1 గంట 48 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్‌ 14 ఏస్‌లు సంధించి, ఏడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)