Breaking News

‘25 పతకాలు పక్కా’

Published on Sun, 08/18/2024 - 04:05

న్యూఢిల్లీ: పారా షట్లర్‌ ప్రమోద్‌ భగత్‌పై సస్పెన్షన్‌ వేటు పడడం పారిస్‌ పారాలింపిక్స్‌లో మన అథ్లెట్ల ప్రదర్శనపై ప్రభావం చూపదని భారత పారాలింపిక్‌ కమిటీ (పీసీఐ) అధ్యక్షుడు దేవేంద్ర ఝఝారియా అన్నాడు. పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌ 25 పతకాలు సాధించగలదని ఝఝారియా ఆశాభావం వ్యక్తం చేశాడు. 

కాగా, యాంటీ డోపింగ్‌ నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ గత ఒలింపిక్స్‌ స్వర్ణపతక విజేత ప్రమోద్‌పై బీడబ్ల్యూఎఫ్‌ 18 నెలల నిషేధం విధించింది. ‘పారాలింపిక్స్‌లో పతకం తెచ్చేవారి జాబితాలో ప్రమోద్‌ భగత్‌ పేరు ముందుండాల్సింది. కానీ అతడిపై నిషేధం పడింది. అయినా విశ్వ క్రీడల్లో మన అథ్లెట్లు 25 పతకాలు సాధించగలరు. పారాలింపిక్స్‌ చరిత్రలోనే ఈసారి భారత్‌ నుంచి అత్యధిక మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 

2020 టోక్యో పారాలింపిక్స్‌లో మనవాళ్లు 19 పతకాలు సాధించారు. ఇప్పుడు ఆ మార్క్‌ దాటడంతో పాటు.. పతకాల జాబితాలో టాప్‌–20లో నిలుస్తాం’ అని ఝఝారియా అన్నాడు. ఈ నెల 28 నుంచి సెపె్టంబర్‌ 8 వరకు జరగనున్న ‘పారిస్‌’ పారా క్రీడల్లో భారత్‌ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పోటీపడుతున్నారు. ఇప్పటికే భారత అథ్లెట్ల బృందం క్రీడా గ్రామంలో అడుగుపెట్టింది.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)