Breaking News

తృటిలో సెంచరీ చేజార్చుకున్న మయాంక్‌ అగర్వాల్‌.. నితీశ్‌ రాణా ఆల్‌రౌండర్‌ షో

Published on Thu, 07/27/2023 - 07:42

దియోదర్‌ ట్రోఫీ వన్డే క్రికెట్‌ టోర్నీలో సౌత్‌ జోన్‌ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. వెస్ట్‌ జోన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సౌత్‌ జోన్‌ 12 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా సౌత్‌ జట్టు 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు.

వెస్ట్‌ బౌలర్లలో పార్థ్‌ మూడు వికెట్లు తీయగా, రాజ్‌వర్ధన్, షమ్స్‌ ములానీలకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగని వెస్ట్‌ జట్టు 36.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (42; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అతీత్‌ షేథ్‌ (40; 6 ఫోర్లు) రాణించారు. సౌత్‌ జోన్‌ స్పిన్నర్లు సాయికిశోర్‌ (3/44), వాషింగ్టన్‌ సుందర్‌ (2/34) వెస్ట్‌ జోన్‌ జట్టును దెబ్బ తీశారు. 

శతక్కొట్టిన ప్రభ్‌సిమ్రన్‌.. నితీశ్‌ రాణా ఆల్‌రౌండర్‌ షో
ఇతర మ్యాచ్‌ల్లో నార్త్‌ జోన్‌ 48 పరుగులతో సెంట్రల్‌ జోన్‌పై, ఈస్ట్‌ జోన్‌ ఎనిమిది వికెట్లతో నార్త్‌ ఈస్ట్‌జోన్‌పై గెలిచాయి. సెంట్రల్‌ జోన్‌తో జరిగిన  మ్యాచ్‌లో నార్త్‌ జోన్‌ ఆటగాడు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌  92 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్‌సిమ్రన్‌ .. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు.

అతనికి కెప్టెన్‌ నితీశ్‌ రాణా (51), మన్‌దీప్‌ సింగ్‌ (43) తోడవ్వడంతో నార్త్‌ జోన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సెంట్రల్‌ జోన్‌.. నితీశ్‌ రాణా (4/48), మయాంక్‌ యాదవ్‌ (3/47) బంతితో ఇరగదీయడంతో 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది.సెంట్రల్‌ జోన్‌ ఇన్నింగ్స్‌లో శివమ్‌ చౌదరీ (51), యశ్‌ దూబే (78), ఉపేంద్ర యాదవ్‌ (52) అర్ధసెంచరీలతో రాణించారు. 

సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్‌..
నార్త్‌ఈస్ట్‌ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈస్ట్‌ జోన్‌ ఓపెనర్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (100) అజేయమైన సెంచరీతో మెరిశాడు. ఫలితంగా నార్త్‌ఈస్ట్‌ జోన్‌ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్‌ జోన్‌ 31.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్త్‌ఈస్ట్‌ జోన్‌ను రియాన్‌ పరాగ్‌ (10-2-30-4) దారుణంగా దెబ్బకొట్టాడు. నార్త్‌ఈస్ట్‌ జోన్‌ ఇన్నింగ్స్‌లో రెక్స్‌ సేన్‌ (65 నాటౌట్‌) ఒక్కడే రాణించాడు.

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)