Breaking News

ఢిల్లీకి ఊహించని షాక్‌.. 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన పుదుచ్చేరి

Published on Mon, 01/08/2024 - 15:53

రంజీ ట్రోఫీ-2024 సీజన్‌ తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీ జట్టుకు ఘోర పరాభావం ఎదురైంది. అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఎలైట్ గ్రూప్ డి మొదటి మ్యాచ్‌లో ఢిల్లీను 9 వికెట్ల తేడాతో పుదుచ్చేరి చిత్తు చేసింది. రంజీ ట్రోఫీ చరిత్రలో పుదుచ్చేరి సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటిగా ఈ మ్యాచ్‌ నిలిచిపోనుంది.

పుదుచ్చేరి చారిత్రత్మక విజయంలో పేసర్‌ గౌరవ్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించిన గౌరవ్‌ యాదవ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 3 వికెట్లతో చెలరేగాడు. ఓవరాల్‌గా 10 వికెట్లు పడగొట్టి గౌరవ్‌ యాదవ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇక ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 148 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బ్యాటర్లలో హర్ష్‌ త్యాగీ(34) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం పుదుచ్చేరి తమ మొదటి ఇన్నింగ్స్‌ను 244 పరుగుల వద్ద ముగించి  96 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్‌ మొదలుపెట్టిన ఢిల్లీ అదే ఆటతీరును కొనసాగించింది.

రెండో ఇన్నింగ్స్‌లో సైతం కేవలం 145 పరుగుల చూపచుట్టేసింది. ఈ క్రమంలో 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే పుదుచ్చేరి ముందు ఢిల్లీ ఉంచగల్గింది. 51 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే పుదుచ్చేరి ఛేదించింది. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌ యష్ ధుల్ దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 25 పరుగులు మాత్రమే చేశాడు. కాగా వ్యక్తిగత ప్రదర్శన మాత్రమే కాకుండా కెప్టెన్‌ ధుల్‌ విఫలమయ్యాడు. 
చదవండి: Pak Vs NZ: పాక్‌ క్రికెట్‌తో ప్రయాణం ముగిసిపోయింది.. ఇక సెలవు!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)