Breaking News

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్‌..! పాపం వార్నర్‌..

Published on Wed, 04/19/2023 - 13:22

ఐపీఎల్‌-2023లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పేలవ ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. ఢిల్లీ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో ఏ‍ప్రిల్‌ 20న అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా కేకేఆర్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని భావిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్‌ తగిలింది.

ఢిల్లీ ఆటగాళ్ల కిట్స్‌ చోరీ..
ఢిల్లీ ఆటగాళ్ల క్రికెట్ కిట్‌లు చోరీకి గురయ్యాయి. ఆటగాళ్ల బ్యాట్లు, ఆర్మ్ ప్యాడ్స్, థై ప్యాడ్స్, షూస్, గ్లోవ్స్ ఇతర విలువైన వస్తువులు కనిపించకుండా పోయాయి. కాగా కేకేఆర్‌తో మ్యాచ్‌ కోసం వార్నర్‌ సేన బెంగళూరు నుంచి నేరుగా ఆదివారం(ఏప్రిల్‌16) ఢిల్లీకు చేరుకుంది. ఢిల్లీ ఎయిర్‌పోర్టు చేరుకున్నాక తమ కిట్లు కనిపించకుండా పోయినట్లు ఆటగాళ్లు గుర్తించారు. కాగా చోరికి గురైన వస్తువులలో 16 బ్యాట్‌లు, బూట్లు, ప్యాడ్‌లు, గ్లోవ్‌లు ఉన్నాయి.

అందులో మూడు బ్యాట్‌లు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు సంబంధించినవి కాగా.. రెండు  మిచెల్‌ మార్ష్‌, మూడు ఫిల్ సాల్ట్, ఐదు బ్యాట్లు యష్ ధుల్‌కి చెందినవి. దీనిపై ఫ్రాంఛైజీ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

"ప్రతీ ఒక్క ప్లేయర్‌ తమ కిట్‌ బ్యాగ్‌ల నుంచి ఎదో ఒక వస్తువును పొగట్టుకున్నారు. ఇది విని మేము షాకయ్యాం.  ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారి. మేము దీనిపై ఎయిర్‌పోర్ట్‌ లాజిస్టిక్స్ విభాగానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాం" అని ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన ఓ వ్యక్తి మీడియాతో పేర్కొన్నాడు.
చదవండి: Mohammed Siraj: ఫిక్సింగ్‌ కలకలం.. సిరాజ్‌కు అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్‌! ఊహించని ట్విస్ట్‌.. అతడెవరంటే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)